Breaking News

విద్వేష ప్రసంగాలకు చెక్‌ పెట్టే ‘హోడియో’!

Published on Fri, 03/13/2026 - 12:59

సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్‌ స్పీచ్‌) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్‌లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఏమిటీ ‘హోడియో’?

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్‌ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.

గత దశాబ్ద కాలంలో స్పెయిన్‌లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.

మస్క్, దురోవ్‌లతో ఢీ!

స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్‌ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్‌, మెటా, టిక్‌టాక్‌లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.

యూరోపియన్ యూనియన్‌లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్‌ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Videos

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు

అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

క్రిష్ 4 పక్కన పెట్టేసిన హృతిక్.. బాబీతో హాలీవుడ్ రేంజ్ మూవీ కన్ఫర్మ్..?

RRRకి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!

బాబు కేబినెట్ భేటీకి ఆరుగురు మంత్రులు డుమ్మా..

Gold: మళ్లీ పెరిగిన బంగారం ధర... ఒక్క రోజులో జంప్..

తెల్ల చొక్కా.. మాసిపోయిన గడ్డం.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు..!

అగ్నిగుండంలా పశ్చిమాసియా.. ఇరాన్ పై రెచ్చిపోయిన ఇజ్రాయెల్

సంజూ శాంసన్ రేంజే వేరు భయ్యో.. ఆస్తులు చూస్తే పరేషానే..!

Photos

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్‌ వద్ద రంజాన్‌ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో వేల్స్‌ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)