Breaking News

దక్షిణ కొరియా 6జీ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ అదుర్స్‌: చైనాకే షాకిస్తుందా..?

Published on Tue, 02/21/2023 - 15:23

సియోల్‌: టెలికం రంగంలో 5జీ నెట్‌వర్క్‌  ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే మన దేశంలో చాలా ప్రాంతాల్లో 5 జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి వచ్చింది.  తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వం  మరో అడుగు ముందుకు  వేస్తోంది. ముఖ్యంగా అనుకున్న దానికంటే రెండు సంవత్సరాల ముందుగానే అందు బాటులోకి తేనున్నామని, దక్షిణ కొరియా  సైన్స్‌, ఐసీటీ మంత్రిత్వశాఖ  సోమవారం తెలిపింది.రాబోయే 6జీ నెట్‌వర్క్ పేటెంట్ పోటీలో ఈ సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచనున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది. 

ఎలెక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్స్, రోబోటిక్  నూతన సాకేంతికత,  ఉత్పత్తులతో దూసుకుపోతున్న దక్షిణ కొరియా 2028లో ప్రపంచంలోనే తొలి 6జీ నెట్‌వర్క్ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. వైర్‌లెస్‌ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా కే-నెట్‌వర్క్ 2030 ప్రణాళికలో భాగంగా నెక్ట్స్‌ జెన్‌ నెట్‌వర్క్ కోసం రానున్న రెండేళ్లలో మరింత వేగవంతం చేయనుంది. 

బెర్నామా నివేదిక ప్రకారం ప్రపంచస్థాయి 6జీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన మొబైల్‌ నెట్‌వర్క్‌ను దక్షిణ కొరియా  ఆవిష్కరించనుంది. కౌంటీ నెట్‌వర్క్ సరఫరా గొలుసును బలోపేతం చేయాలనే ప్రణాళికలో భాగంగా, దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ  కసరత్తు చేస్తోంది.  ఇందుకోసం  625.3 బిలియన్ వోన్‌ లేదా 481.7 బిలియన్‌ డాలర్ల విలువైన కోర్ 6జీ సాంకేతికతలపై పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్ట్  సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, దేశంలో తదుపరి తరం మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ ఉత్పత్తులపై దేశీయ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మొబైల్ పరికరానికి అనుకూలంగా ఉండే ఓపెన్ RAN లేదా ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థానిక కంపెనీలను ప్రోత్సహించనుదని Yonhap  నివేదించింది.

కాగా ఆసియాలో నాల్గవ-అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గత సంవత్సరం 5జీ పేటెంట్ల సంఖ్యలో 25.9 శాతంగా ఉంది. ఈ విషయంలో మార్కెట్ లీడర్ చైనాను 26.8 శాతం మాత్రమే అనేది గమనార్హం. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు