Breaking News

‘జీవితం’పై జాగ్రత్త మనవాళ్లకే ఎక్కువండోయ్‌..

Published on Thu, 08/07/2025 - 19:47

జీవిత బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక రక్షణకు ప్రాధాన్యత అధికమవుతోంది. ఈ విషయంలో దేశంలోని ఇతర ప్రాంతాల కంటే దక్షిణాది ప్రాంతం ఎంతో ముందుంది. జీవిత బీమా యాజమాన్యం, ఆర్థిక రక్షణలో దక్షిణ భారతదేశం జాతీయ స్థాయిలో ముందంజలో ఉందని ఇటీవలి ఇండియా ప్రొటెక్షన్ కోషియెంట్ (ఐపీక్యూ) 7.0 నివేదిక వెల్లడించింది. పట్టణ కేంద్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో దక్షిణ భారత ప్రాంతాలలో జీవిత బీమా 84 శాతం చొచ్చుకుపోయినట్లు వెల్లడైంది. ఇది దేశంలోనే అత్యధికం.

ఫైనాన్షియల్ ప్రొటెక్షన్‌లో రీజనల్ లీడర్ షిప్
చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కీలక సూచీల్లో జాతీయ బెంచ్ మార్క్ లను అధిగమించాయి. యాజమాన్యంలో చెన్నై అగ్రస్థానంలో, ఆర్థిక భద్రతలో హైదరాబాద్ అగ్రస్థానంలో, అవగాహనలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచాయి. నేను లేకపోతే నా కుటుంబం ఏమౌతుందో.. అన్న ఆందోళనతో ఆర్థిక ప్రణాళికకు చాలామంది సిద్ధమవుతున్నారు.

ఈ నివేదిక టర్మ్ ఇన్సూరెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో 77% మంది కుటుంబ రక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రదాయ పొదుపు-ఆధారిత పాలసీల నుండి స్వచ్ఛమైన రిస్క్ కవరేజీకి మారడాన్ని ఇది సూచిస్తుంది.

మహిళలకు మరీ ఎక్కువ
జీవిత బీమా, ఆర్థిక రక్షణపై జాగ్రత్త మహిళల్లోనే మరీ ఎక్కువ కనిపిస్తోంది. గుర్తించదగిన ధోరణిలో 86% మంది దక్షిణ భారత మహిళలు జీవిత బీమాను కలిగి ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడైంది. ఇది పురుషల  సగటు (83%), జాతీయ మహిళా సగటు (75%) రెండింటినీ అధిగమించింది. ఆర్థిక పరిజ్ఞానం, భద్రతలో కూడా మహిళలు ఎక్కువ మార్కులు సాధించారు, ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో లింగ అంతరాన్ని తగ్గించారు.

యువతలోనూ..
టర్మ్ ప్లాన్లు, యులిప్‌లు, పొదుపు ఆధారిత పాలసీలతో సహా వివిధ బీమా ఉత్పత్తులను అవలంబించడంలో యువత ముందంజలో ఉంది. దీంతోపాటు పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి మైలురాళ్ల కోసం చాలా మంది పెట్టుబడులు పెడుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది.

సవాళ్లూ ఉన్నాయ్‌..
అధిక మొత్తంలో బీమా యాజమాన్యం ఉన్నప్పటికీ సవాళ్లూ ఉ‍న్నాయి. ప్రతి ముగ్గురు పట్టణ ప్రాంత దక్షిణ భారతీయులలో ఒకరు టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఎప్పుడూ పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఇందుకు ఆర్థిక స్థోమత, అత్యవసరత లేకపోవడం  వంటివి అవరోధాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యువత, తక్కువ-ఆదాయ సమూహాలలో ఇది ఎక్కువగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)