Breaking News

రూ. 16వేల మొబైల్ బుక్ చేస్తే.. ఏమొచ్చిందో తెలుసా?

Published on Tue, 03/04/2025 - 07:46

టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మోసాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఆదమరిస్తే.. ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన కథనాలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటిదే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంతకీ.. ఇది ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది? అనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

దక్షిణ ఢిల్లీలోని షేక్ సారాయ్‌కు చెందిన ఒక వ్యక్తి మొబైల్ కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేశారు. ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి డెలివరీ వచ్చింది. కానీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే.. అందులో సోప్ బార్, బిస్కెట్ ప్యాకెట్ ఉండటం చూసి ఖంగుతిన్నాడు.

బాధితుడు ఫిబ్రవరి 11న రూ.16,680 విలువైన మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఫిబ్రవరి 12న డెలివరీ ఏజెంట్ పేరుతో.. కాల్ చేసి ఈ రోజు డెలివరీ చేస్తానని చెప్పాడు. కానీ కొనుగోలుదారు (బాధితుడు) కోరికమేరకు మరుసటి రోజు ఉదయం డెలివరీ చేసాడు. డెలివరీ తీసుకున్న తరువాత, తాను చెల్లించాల్సిన మొత్తాన్ని.. యూపీఐ ద్వారా చెల్లించారు.

డబ్బు చెల్లించి.. ఆఫీసుకు వెళ్లి దాన్ని ఓపెన్ చేస్తే, మొబైల్ స్థానంలో బిస్కెట్ ప్యాకెట్, సోప్ బార్ ఉన్నాయి. మోసపోయానని గ్రహించాడు. డెలివరీ ఏజెంట్ నెంబర్‌కు కాల్ చేసాడు.  మొదట్లో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కారమవుతుందని అతనికి డెలివరీ ఏజెంట్ చెప్పాడు. తరువాత ఆ నెంబర్‌కు కాల్ చేస్తే.. స్విచ్ ఆఫ్ వచ్చింది. షాపింగ్ వెబ్‌సైట్‌ కూడా అతని ఈమెయిల్‌లకు స్పందించలేదు.

ఇదీ చదవండి: '8-8-8 రూల్ పాటించండి': పనిగంటలపై నీర్జా బిర్లా

బాధితుడు చేసేదేమీ లేక.. పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ డెలివరీ ఏజెంట్‌ను ట్రాక్ చేయడానికి, మోసగాళ్లు కస్టమర్ వివరాలను ఎలా యాక్సెస్ చేశారో తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.

ఇలాంటి మోసాల నుంచి ఎలా బయటపడాలంటే?
మోసగాళ్ళు ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో.. ప్రజలను దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్య పెరుగుతున్నందున, వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

➤డెలివరీ తీసుకోవడానికి ముందు.. డెలివరీ ఏజెంట్లు నిజమైనవారా? కాదా? అని ధృవీకరించుకోవాలి. 
➤వ్యక్తిగత వివరాలను ఎప్పుడు పంచుకోకూడదు. లావాదేవీలను పూర్తి చేసే ముందు ప్యాకేజీలను చెక్ చేసుకోవాలి. 
➤ఏదైనా అనుమానం కలిగితే.. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఫిర్యాదు చేయాలి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)