Breaking News

ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా..? ఇవి తెలుసుకోండి

Published on Tue, 06/04/2024 - 11:06

గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్‌) చేసే సమయం దగ్గర పడింది. జులై 31లోపు ఐటీఆర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చివరి వరకు వేచిచూడకుండా ఆలోపే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలనే సందేహంతో ఉన్నారు. కొన్ని అంశాలు పాటించడం ద్వారా ఏ పద్ధతి ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేస్తోంది. ముందుగానే నింపిన ఐటీఆర్‌ ఫారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ మొదటిసారి ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికీ, పాతవారికీ కొంత ఆందోళన ఉండటం సహజమే. అయితే దీన్ని అధిగమించాలంటే కొన్ని అంశాలపై అవగాహన అవసరం.

ఆదాయం
ఆర్థిక సంవత్సరం 2023-24లో రిటర్న్‌లు దాఖలు చేసేవారి మొత్తం ఆదాయం ఎంతనే విషయంలో స్పష్టత ఉండాలి. వేతనం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, ప్రయోజనాలు, వడ్డీ, డివిడెండ్లు ఇతర ఆదాయాలన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఆదాయం తెలుస్తుంది. ఇందులో నుంచి ఆదాయపు పన్ను చట్టం కల్పించిన మినహాయింపులను తీసివేస్తే పన్ను వర్తించే ఆదాయంపై స్పష్టత వస్తుంది.

కొత్తదా..? పాతదా..?
రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్‌’గా మారింది. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానంలో తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు. ఈ విధానాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.

  • పాత పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, సెక్షన్‌ 80ఈ, గృహరుణ వడ్డీ, ఇంటి అద్దె భత్యం లాంటివి ఇందులో క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇవి గణనీయంగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.

  • కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. రూ.7.50లక్షల లోపు ఆదాయం (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్న వారు ఈ పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి పన్ను వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమకు ఏ పన్ను విధానం ఉత్తమమో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.

సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలివే..
పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫారం-16, ఫారం 26ఏఎస్‌, వడ్డీ ఆదాయం, డివిడెండ్లకు సంబంధించిన వివరాలు, ఇంటి రుణం వడ్డీ, ఇతర పెట్టుబడుల ఆధారాలు దగ్గర ఉండాలి. ఫారం-16, రిటర్నులను దాఖలు చేసిన రశీదుతో పాటు పెట్టుబడులు, ఇతర పత్రాలన్నింటినీ కలిపి జాగ్రత్త చేసుకోవాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వీటిని వెంటనే తీసుకునేందుకు వీలవుతుంది.

ఫారం-16: మీ జీతభత్యాలు, మూలం వద్ద పన్ను తగ్గింపు (టీడీఎస్‌)కు సంబంధించిన వివరాలతో యాజమాన్యం అందించే పత్రం ఇది. దీని ఆధారంగానే ఉద్యోగులు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఫారం 26ఏఎస్‌: ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన అన్ని ఆదాయాలు, టీడీఎస్‌, మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్‌) వివరాలు ఇందులో తెలుస్తాయి. మీ ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పోల్చి చూసుకోవాలి.

వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌): వేతనం, ఇతర మార్గాల్లో ఆర్జించిన ఆదాయాలతోపాటు, డివిడెండ్లు, మ్యూచువల్‌ ఫండ్‌, సెక్యూరిటీల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు మొదలైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఏఐఎస్‌ ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆదాయాల ఆధారంగానే ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌లోని ఫారం ముందుగానే కొంత మేర నింపి ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)