Breaking News

హైదరాబాద్‌లో మరో సొల్యూషన్స్3ఎక్స్ ట్రైనింగ్ సెంటర్

Published on Fri, 01/10/2025 - 19:16

హైదరాబాద్: సొల్యూషన్స్3ఎక్స్ మెడికల్ కోడింగ్ తమ లేటెస్ట్ ట్రైనింగ్ కేంద్రాన్ని హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ప్రారంభించింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ (AAPC), అమెరికన్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AHIMA) నుంచి రెండు ప్రమాణాలు పొందిన భారతదేశంలో ఏకైక మెడికల్ కోడింగ్ శిక్షణ సంస్థ ఈ 'సొల్యూషన్స్3ఎక్స్'. ఈ సంస్థ హైటెక్ సిటీలో తన మొదటి కేంద్రాన్ని కొనసాగిస్తూ.. నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తోంది.

సొల్యూషన్స్3ఎక్స్ మెడికల్ కోడింగ్ నూతన శిక్షణ కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేష్ పొట్లూరి, ముత్తుకుమారన్ గాంధీ, సమియుల్లా మహమ్మద్, రాజశేఖర్ గుమ్మడి, ప్రథిమా హాజరయ్యారు.

సొల్యూషన్స్3ఎక్స్ ఇప్పటికే 2,000 మందికి పైగా మెడికల్ కోడింగ్ ప్రొఫెషనల్స్‌ను సృష్టించింది. గ్లోబల్‌గా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు, వైద్య రంగంలో అత్యవసరంగా కావలసిన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించి వారికి ఒక ఆర్థికపరమైన, స్థిరమైన కెరీర్‌ను అందించడంలో సఫలమైంది.

మెడికల్ కోడింగ్ ప్రస్తుతం విద్యార్థులకు అధిక వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలను అందించగలిగిన రంగంగా మారింది. ముఖ్యంగా పెరుగుతున్న ఆరోగ్యరంగంలో జీవశాస్త్రం లేదా ఆరోగ్య రంగానికి చెందిన విద్యార్థులకే పరిమితమైనదన్న అపోహను చెరిపివేస్తూ.. సరైన శిక్షణ ద్వారా ఏ విద్యా నేపథ్యం కలిగినవారైనా ఈ రంగంలో మంచి ఉద్యోగాలను పొందవచ్చని నిరూపిస్తోంది.

సొల్యూషన్స్3ఎక్స్‌లో.. మేము విద్యార్థులకు కేవలం సర్టిఫికేషన్‌లను అందించడమే కాకుండా, ఆరోగ్య రంగంలో మంచి కెరీర్‌ను పొందడానికి వారిని సన్నద్ధం చేయడం మా ప్రధాన లక్ష్యం. అమీర్‌పేటలో మా నూతన కేంద్రం విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, గ్లోబల్ సర్టిఫికేషన్లతో పాటు.. విజయానికి అవసరమయ్యే ఆత్మవిశ్వాసాన్ని అందించేందుకు రూపొందించబడింది.

మెడికల్ కోడింగ్ ఒక సులభతరమైన, అత్యంత ప్రాముఖ్యత కలిగిన రంగం. ఇది ఏ విద్యా నేపథ్యం కలిగిన వారికైనా అందుబాటులో ఉంటుందని సొల్యూషన్స్3ఎక్స్ సీఈఓ ముత్తుకుమారన్ గాంధీ అన్నారు.

ఈ నూతన శిక్షణ కేంద్రంలో ప్రాక్టిస్ ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS) వంటి టెక్నాలజీ ఆధారిత వాతావరణం అందుబాటులో ఉన్నాయి. బహుభాషా శిక్షణదారుల మద్దతు ద్వారా, నేర్చుకోవడం సులభంగా ఉంటుంది. అలాగే, ఆఫ్‌లైన్ క్లాసులు, ఇతర ప్రాంతాల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ శిక్షణ ఆప్షన్లను అందించడం ద్వారా అన్ని వర్గాల విద్యార్థులకూ అందుబాటులో ఉండేలా చూస్తోంది.

సొల్యూషన్స్3ఎక్స్ డ్యూయల్ ఏఏపీసీ, ఏహెచ్ఐఎమ్‌ఎ ప్రమాణాలు కలిగి, గ్లోబల్‌గా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్‌లను అందించే సంస్థగా హామీ ఇస్తోంది. ఇది ఇప్పటికే 10కి పైగా మల్టీనేషనల్ కంపెనీలకు నమ్మదగిన శిక్షణ భాగస్వామిగా ఉంది. విద్యార్థుల సర్టిఫికేషన్ పరీక్షలలో 90% పాస్ రేట్ సాధించడం సొల్యూషన్స్3ఎక్స్ గొప్ప విజయంగా నిలిచింది. విద్యార్థుల ఆర్థిక భారం తగ్గించేందుకు, సొల్యూషన్స్3ఎక్స్ సర్టిఫికేషన్ ఫీజులపై ప్రత్యేక డిస్కౌంట్‌లు అందిస్తూ, అన్ని వర్గాల విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. సొల్యూషన్స్3X తో మెడికల్ కోడింగ్‌లో శిక్షణ, ఉద్యోగ సహాయం కోసం 7893234949కు సంప్రదించవచ్చు

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)