Breaking News

పేటీఎంను పూర్తిగా వదిలించుకున్న సాఫ్ట్‌బ్యాంక్

Published on Sun, 07/14/2024 - 13:56

ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ నిష్క్రమించింది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడి విభాగం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ (SVF) జూన్ త్రైమాసికంలో సుమారు 150 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1250 కోట్లు) నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించిందని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

సాఫ్ట్‌బ్యాంక్ 2017లో పేటీఎం బ్రాండ్ యజమాన్య సంస్థ అయిన 'వన్‌ 97 కమ్యూనికేషన్స్‌'లో సుమారు 1.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.2024-25 ఆర్థిక సంవత్సరం (FY25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 10-12 శాతం నష్టంతో పేటీఎం నుంచి నిష్క్రమించింది. 2021లో పేటీఎం ఐపీఓకి ముందు సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎంలో దాదాపు 18.5 శాతం వాటాను కలిగి ఉంది.

సాఫ్ట్‌బ్యాంక్ ఎస్వీఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 17.3 శాతం వాటాను, ఎస్వీఎఫ్‌ పాంథర్ (కేమాన్) లిమిటెడ్ ద్వారా 1.2 శాతం వాటాను కలిగి ఉంది. ఎస్వీఎఫ్‌ పాంథర్ ఐపీఓ సమయంలో తన మొత్తం వాటాను  రూ.1,689 కోట్లకు అంటే దాదాపు 225 మిలియన్‌ డాలర్లకు విక్రయించింది. ఎస్వీఎఫ్‌ ఇండియా హోల్డింగ్స్ (కేమాన్) లిమిటెడ్ పేటీఎంలో తన మిగిలిన 1.4 శాతం వాటాను విక్రయించింది.

ఐపీఓ జరిగిన 24 నెలల తర్వాత పేటీఎం నుంచి నిష్క్రమించనున్నట్లు గతంలోనే సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇప్పుడు బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే కంపెనీ నష్టాన్ని అంచనా వేసిందని కంపెనీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. అప్పట్లో సాఫ్ట్‌బ్యాంక్ పేటీఎం షేర్‌లను సగటున రూ.800 చొప్పున కొనుగోలు చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)