Breaking News

స్మార్ట్‌ఫోన్‌.. ఆఫ్‌లైన్‌ రూట్‌!

Published on Wed, 06/25/2025 - 00:45

ఇప్పటివరకు ఆన్‌లైన్‌ మాధ్యమానికి ఎక్కువగా ప్రాధాన్యమిచి్చన స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు క్రమంగా ఆఫ్‌లైన్‌ బాట పడుతున్నాయి. సులభతరమైన ఫైనాన్సింగ్‌ అవకాశాల దన్నుతో అమ్మకాలను పెంచుకునేందుకు చిన్న పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు వరుసగా ఏడు నెలల పాటు ఆన్‌లైన్‌ రిటైలర్లకు షిప్‌మెంట్లు (టోకు విక్రయాలు) తగ్గడం, ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు పెరగడం ఇందుకు నిదర్శనమని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

ఆన్‌లైన్‌ రిటైలర్లకు వరుసగా రెండో నెల ఏప్రిల్‌లో రెండంకెల స్థాయిలో తగ్గినట్లు వివరించాయి. ఏప్రిల్‌లో షిప్‌మెంట్లు ఏకంగా 20 శాతం మేర క్షీణించాయి. మరోవైపు, ఆఫ్‌లైన్‌ రిటైలర్లకు 10 శాతం పెరిగాయి. వరుసగా ఎనిమిది నెలల పాటు ఆఫ్‌లైన్‌కి షిప్‌మెంట్లు పెరిగినట్లయిందని ఐడీసీ ఇండియా రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసనా జోషి తెలిపారు. మొత్తం షిప్‌మెంట్లను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో పెద్దగా మార్పు లేకుండా 1.2 కోట్ల స్థాయిలో ఉన్నట్లు వివరించారు. 

మోటరోలా షిప్‌మెంట్లు 64 శాతానికి డౌన్‌.. 
మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కెనాలిస్‌ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో మోటరోలా ఆన్‌లైన్‌ షిప్‌మెంట్లు 64%కి పరిమితమయ్యాయి. అంతక్రితం క్యూ1లో ఇవి 82%గా నమోదయ్యాయి. ఇక వన్‌ప్లస్‌ విషయానికొస్తే  ఇదే వ్యవధిలో షిప్‌మెంట్లు 85% నుంచి 71%కి తగ్గాయి. మరోవైపు, ఈ–కామర్స్‌ ఫ్లాష్‌ సేల్స్‌తోనే భారత మార్కెట్లోకి ప్రవేశించిన షావోమీ సైతం ఆమ్నిచానల్‌ బాట పట్టింది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

ఆమ్నిచానల్‌ వ్యూహం.. 
ప్రాథమికంగా ఆన్‌లైన్‌ మాధ్యమం మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేందుకు బాగా ఉపయోగపడినప్పటికీ, దేశీయంగా ఈ–కామర్స్‌ విస్తృతి ఇప్పటికే ఒక స్థాయికి చేరిన విషయాన్ని బ్రాండ్లు గుర్తిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. కోవిడ్‌ అనంతరం ఒక్కసారిగా ఆన్‌లైన్‌ అమ్మకాలు ఎగిసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయిలో కొనసాగలేదు. గ్రామీణ ప్రాంతాల కొనుగోలుదారులు పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంపైనే ఆధారపడటం లేదు. ఇప్పటికీ ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు.

దీంతో విక్రయాలను పెంచుకునేందుకు ఏదో ఒక మాధ్యమంపైనే ఎక్కువగా దృష్టి పెట్టకుండా, అన్ని మార్గాలను ఉపయోగించుకునే ఆమ్నిచానల్‌ వ్యూహాన్ని బ్రాండ్లు అనుసరిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌ రిటైలర్లను ఆకర్షణీయమైన మార్జిన్లు, సపోర్ట్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో విక్రయించే ఉత్పత్తులను అదే రేటుకు ఆఫ్‌లైన్‌లోనూ అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ సరఫరాలను తగ్గిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు వివరించాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)