Breaking News

చూడటానికి డబ్బాలా కనిపించే ఈ గాడ్జెట్‌ .. మొక్కలకు మంచి నేస్తం

Published on Sun, 11/05/2023 - 10:04

చూడటానికి డబ్బాలా కనిపించే ఈ పరికరం మొక్కలకు స్మార్ట్‌ నేస్తం. ఇది మొక్కలకు నిత్యం నీటిని సరఫరా చేస్తూ, వాటి పచ్చదనాన్ని కాపాడుతుంది. ఇందులో ఐదులీటర్ల వాటర్‌ట్యాంకు ఉంటుంది. దీనిని ఇంటి ఓవర్‌హెడ్‌ ట్యాంకు లేదా సంప్‌కి అనుసంధానం చేసుకోవచ్చు. దానివల్ల ట్యాంకులో నీటిమట్టం నిరంతరం ఒకేలా ఉంటుంది.

ఇందులోని నీరు దీని వెనుకనున్న సన్నని గొట్టాల ద్వారా మొక్కలకు చేరుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా పనిచేస్తుంది. ఇందులోని మ్యాగ్నెటిక్‌ సెన్సర్లు పరిసరాల్లోని ఉష్ణోగ్రతను, మొక్కల్లోని తేమను, మట్టిలోని తేమను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉంటాయి. మొక్కల అడుగున మట్టిలోను, మొక్కల్లోను తేమ ఏమాత్రం తగ్గినా, వాటికి తగిన నీటిని విడుదల చేస్తుంది.

‘ప్లాంట్‌మేట్‌’ పేరుతో స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ప్లాంటప్‌’ కంపెనీ ఇటీవల దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఇంట్లో ఉన్నట్లయితే, ఇంట్లోని మొక్కల సంరక్షణ గురించి ఎలాంటి దిగులు ఉండదు. ఒకవేళ ఇల్లు విడిచి కొద్దిరోజులు ఊరికి వెళ్లాల్సి వచ్చినా మొక్కలకు నీరు అందకపోయే సమస్యే ఉండదు. దీని ధర 199 డాలర్లు (రూ.16,561) మాత్రమే! 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)