Breaking News

వంటగది కోసం.. ప్రత్యేక గ్యాడ్జెట్స్!

Published on Sun, 04/12/2026 - 19:07

వంటగదిలో గంటల తరబడి కష్టపడాల్సిన పనిలేకుండా, అదే పనిని తక్కువ టైమ్‌లో, తక్కువ శ్రమతో స్టయిలిష్‌గా పూర్తి 
చేసే గాడ్జెట్లు మీకోసం!

స్ప్రే టచ్‌! 
మీ కిచెన్‌లో టేస్ట్‌ మాత్రమే కాదు, హెల్త్‌ కూడా కంట్రోల్‌లో ఉండాలంటే ఈ స్మార్ట్‌ ఆయిల్‌ స్ప్రేయర్‌ ఉండాల్సిందే! ఎందుకంటే, ఇది కేవలం ఒక నూనె బాటిల్‌ మాత్రమే కాదు. ఇందులో డ్యూయల్‌ మ్యాజిక్‌ ఉంది. మీకు కావాలంటే నూనెను ధారగా పోసుకోవచ్చు, వద్దు అనుకుంటే పైన ఉన్న నాజిల్‌తో మంచు జల్లులా స్ప్రే చేసుకోచ్చు. మీరు ఎయిర్‌ ఫ్రయ్యర్‌లో చికెన్‌ రోస్ట్‌ చేసినా, దోశలు వేస్తున్నాం ఒక్కసారి స్ప్రే చేస్తే చాలు, నూనె మొత్తం సమానంగా పరుచుకుంటుంది. దీనివల్ల నూనె వృథా కాదు, మీ ఒంట్లో కొవ్వు చేరే చాన్స్‌ కూడా తగ్గుతుంది! సలాడ్స్‌ నుంచి బార్బెక్యూ వరకు అన్నిటికీ పర్ఫెక్ట్‌ ఫినిషింగ్‌ ఇచ్చే దీని ధర రూ. 380 మాత్రమే!

వంటింట్లో ఆర్గానిక్‌ ఫామ్‌!
బయట మార్కెట్లో దొరికే మొలకలు ఎప్పుడు తయారు చేశారో, ఎంత శుభ్రంగా ఉన్నాయో అని సందేహిస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే తాజా మొలకలను అతి తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవడానికి వచ్చేసింది ఈ స్ప్రౌట్‌ మేకర్‌! ఇందులో ఉన్న స్మార్ట్‌ ‘నాబ్‌’ టెక్నాలజీ వల్ల నీరు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు నెమ్మదిగా వెళ్లి, గింజలకు కావాల్సిన తేమను అందిస్తుంది.

దీంతో మొలకలు కుళ్లిపోకుండా, చాలా తాజాగా, పోషకాలతో నిండి ఉంటాయి. పైగా ఇందులో నాలుగు వేర్వేరు కంపార్ట్‌మెంట్‌ ట్రేలు ఉంటాయి. అంటే ఒకేసారి పెసలు, శనగలు, అలసందలు ఇలా నాలుగు రకాల గింజలను మొలకెత్తించవచ్చు. అంతేకాదు, ట్రాన్స్పరెంట్ బాక్స్‌ వల్ల మొలకలు ఎంతవరకు వచ్చాయో బయట నుంచే చూసుకోవచ్చు. ధర రూ. 290 మాత్రమే!

స్నాక్‌ పార్ట్నర్‌!
సినిమా చూస్తున్నప్పుడో లేదా ఇష్టమైన మ్యాచ్‌ జరుగుతున్నప్పుడో పిస్తాపప్పులు, వేరుశెనగలు తింటూ ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా? కానీ ఆ పెంకులు, తొక్కలు ఎక్కడ వేయాలో తెలియక చేత్తో పట్టుకోవడమో లేదా టేబుల్‌ మీద పడేయడమో చేస్తున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ డబుల్‌ డిష్‌ నట్‌ బౌల్‌!

ఇది మామూలు గిన్నె కాదు, మీ స్నాక్‌ టైమ్‌ను క్లీన్‌గా, స్టయిలిష్‌గా మార్చే చిన్న మ్యాజిక్‌ బౌల్‌! ఇందులో డబుల్‌ డిష్‌ బౌల్స్‌ ఉంటాయి. పై భాగంలో మీ ఫేవరెట్‌ నట్స్‌ లేదా పండ్లను పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత వచ్చే పెంకులు, విత్తనాలు లేదా పిక్కలను కింద ఉన్న హోల్డర్‌లో సులభంగా పడేయవచ్చు. అవసరమైతే దీనిని విడదీసి రెండు విడివిడి గిన్నెలుగా కూడా వాడుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉండటమే కాకుండా, క్లీన్ చేయడం కూడా చాలా సులభం. ధర రూ. 280 మాత్రమే!

#

Tags : 1

Videos

కీర్తనను చంపింది నిజమే.. శిక్ష వేయండి.. ఎన్ కౌంటర్ చేయొద్దు

శాంతి చర్చలు విఫలం.. పాక్ ఆందోళన..

షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..

ఆమె సాక్ష్యం చెప్తుందని ఎవరు ఊహించలేదు.. వాళ్ళకి శిక్ష రద్దయితే రేవతి పరిస్థితి ఇదే.

ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

చిక్కుల్లో విష్ణు ప్రియ.. అసభ్యకర ఫోటోలు పెట్టి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు వసూల్

సంగీత ప్రపంచానికి తీరని లోటు..

ABN రాధాకృష్ణ కు సపోర్ట్ చేస్తూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్

ఎక్కడ ఆపాడో అక్కడ్నుంచే మొదలెట్టాడు.. చెన్నైలో చితకొట్టిన చెట్టా...

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

Photos

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)

+5

శర్వానంద్‌ 'బైకర్‌' థాంక్యూ మీట్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్‌లో తెలుగు హీరోయిన్‌ మానస వారణాసి (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు (ఫొటోలు)