Breaking News

లాంచ్‌కు ముందే అమ్ముడైపోయాయ్!: ధర ఎంతంటే?

Published on Fri, 07/03/2026 - 14:43

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కొడియాక్ ఆర్ఎస్' కారును స్కోడా ఆటో ఇండియా దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) ద్వారా దిగుమతి చేసుకుంటుంది.

స్కోడా లాంచ్ చేసిన ఈ కొత్త కొడియాక్ ఆర్ఎస్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన తరువాత.. ఆరు నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడైపోయాయి. దీన్నిబట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో దీనికున్న డిమాండ్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.

స్కోడా కొడియాక్ ఆర్ఎస్ కార్లను కంపెనీ మన దేశానికి కేవలం 50 యూనిట్లను మాత్రమే పరిమితం చేసింది. భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ద్వారా పనిచేసే ఈ లేటెస్ట్ మోడల్ 265 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా శక్తి నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.

స్కోడా కొడియాక్ ఆర్ఎస్ 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీంతో ఇది భారతదేశంలో ఇప్పటివరకు లాంచ్ అయిన అత్యంత వేగవంతమైన స్కోడా మోడల్‌గా నిలిచింది. ఆర్ఎస్ వేరియంట్‌లో ప్రోగ్రెసివ్ స్టీరింగ్, 15 అడ్జస్టబుల్ సెట్టింగ్‌లతో కూడిన అడాప్టివ్ డాంపర్‌లు కూడా ఉన్నాయి. ఇవన్నీ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇది చూడటానికి స్టాండర్డ్ కొడియాక్ మాదిరిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. వీటిలో రీడిజైన్ బంపర్‌లు, ఆర్ఎస్ బ్యాడ్జింగ్, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, పెద్ద రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి ఉన్నాయి. గ్రిల్, ORVMలు, విండో ఫ్రేమ్‌లు, రూఫ్ రైల్స్, డీ-పిల్లర్ అంతటా గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్స్‌ను ఉపయోగించారు. ఈ SUV వెల్వెట్ రెడ్, మ్యాజిక్ బ్లాక్, మూన్ వైట్, స్టీల్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొడియాక్ ఆర్ఎస్ కారులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆర్ఎస్ స్పెషల్ గ్రాఫిక్స్‌తో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్, హీటింగ్ అండ్ మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 13-స్పీకర్ల కాంటన్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఈ SUVలో తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ సిస్టం వంటివి ఉన్నాయి. ఇది ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ ఆర్-లైన్‌కు పోటీగా ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)