Breaking News

‘సిప్‌’ సరికొత్త రికార్డు.. ఈ ఇన్వెస్ట్‌ మీరూ చేస్తున్నారా?

Published on Sat, 10/12/2024 - 18:14

న్యూఢిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్‌ఐపీ– సిప్‌) పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) సెప్టెంబర్‌ తాజా గణాంకాల ప్రకారం– సిప్‌లోకి సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్‌ఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు.  

ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు.. 
ఇక మొత్తంగా చూస్తే,  ఈక్విటీ ఫండ్స్‌లోకి  ఇన్వెస్ట్‌మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్‌ క్యాప్, థీమెటిక్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్‌ నిర్వహణలో ఉన్న ఆస్తుల  విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)