Breaking News

మణిపాల్‌ హాస్పిటల్స్‌లో షియర్స్‌కు మెజారిటీ వాటా

Published on Sat, 04/08/2023 - 06:11

న్యూఢిల్లీ: మణిపాల్‌ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్‌ హెల్త్‌కేర్‌ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్‌కేర్‌ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్‌ ఈక్విటీ డీల్‌ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్‌పై వచ్చే వారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని వివరించాయి. ఒప్పందం ప్రకారం మణిపాల్‌ హాస్పిటల్స్‌ విలువ సుమారు రూ.40,000 కోట్లు – రూ.42,000 కోట్లుగా మదింపు చేసినట్లు పేర్కొన్నాయి.

ప్రమోటర్‌ కుటుంబం, ఇతర ఇన్వెస్టర్లయిన టీపీజీ, ఎన్‌ఐఐఎఫ్‌ నుంచి వాటాలు కొనుగోలు చేయడం ద్వారా తన వాటాను పెంచుకునేందుకు షియర్స్‌ ప్రయత్నాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మిగతా ఇన్వెస్టర్ల నుంచి 41 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా షియర్స్‌ తన మొత్తం వాటాను 59 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మణిపాల్‌ గ్రూప్‌నకు 28 ఆస్పత్రులు, 8,000 పడకలు ఉన్నాయి.  

సింగపూర్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం టెమాసెక్‌కు సంబంధించిన హెల్త్‌కేర్‌ డెలివరీ అసెట్లను షియర్స్‌ నిర్వహిస్తోంది. షియర్స్‌కు మణిపాల్‌ హాస్పిటల్స్‌లో ప్రస్తుతం 18 శాతం వాటాలు ఉన్నాయి. దానితో పాటు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీకి 21%, భారత సార్వభౌమ వెల్త్‌ఫండ్‌ నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌)కు 8 శాతం వాటాలు ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన హాస్పిటల్‌ చెయిన్‌ మెడికా సినర్జీ, మెడాంటా హాస్పిటల్స్‌ ఆపరేటర్‌ గ్లోబల్‌ హెల్త్‌లోనూ షియర్స్‌ వాటాదారుగా ఉంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)