సింపుల్‌ వన్‌: లాంగెస్ట్‌ రేంజ్‌ స్కూటర్‌ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?

Published on Wed, 05/24/2023 - 11:43

చెన్నై: ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల తయారీలో ఉన్న బెంగళూరు కంపెనీ సింపుల్‌ ఎనర్జీ తాజాగా సింపుల్‌ వన్‌ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ధర బెంగళూరు ఎక్స్‌షోరూంలో రూ.1.45 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 212 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. కస్టమర్‌లు  రూ. 13,000 అదనంగా  చెల్లించి 750-వాట్ల పోర్టబుల్ ఛార్జర్‌ని తీసుకోవచ్చు. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్‌, అందంగా సల్మాన్‌ ఖాన్‌)

2021 ఆగస్ట్‌ 15న రూ.1.10 లక్షల ధరతో ఈ మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. కాగా, జూన్‌ 6 నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని సింపుల్‌ ఎనర్జీ తెలిపింది. దేశవ్యాప్తంగా విస్తరణ, సామర్థ్యం పెంపునకు వచ్చే 12-18 నెలల్లో సుమారు రూ.820 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఫౌండర్‌ సుహాస్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. ఏడాదిలో 40-50 నగరాల్లో 180 వరకు ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

సింపుల్‌ వన్‌ కోసం ఇప్పటికే ఒక లక్ష యూనిట్లకు బుకింగ్స్‌ ఉన్నాయని వెల్లడించారు. ధర రూ.35 వేలు పెరిగినప్పటికీ బుకింగ్స్‌ రద్దు కాకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని శూలగిరి వద్ద ప్లాంటుకు ఇప్పటికే కంపెనీ రూ.110 కోట్లు ఖర్చు చేసింది. వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు.   (కొత్త వ్యాపారంలోకి నయన్‌, అంత సాహసం ఎందుకు చేస్తోంది? క్లారిటీ)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)