సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్ - నిరీక్షణకు తెర పడ్డట్టే..

Published on Thu, 04/27/2023 - 11:54

ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో మొదటిసారి తన ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలచేసినప్పుడు బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు అనేక విధాలుగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని టెస్ట్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్కూటర్ మే 23 న అధికారికంగా మార్కెట్లో విడుదలకానున్నట్లు సమాచారం.

సింపుల్ ఎనర్జీ 2023 మే 23న తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలో ఏర్పడిన లోపల వల్ల కొన్ని కంప్లైంట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో కంపెనీ సింపుల్ వన్ స్కూటర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తూ విడుదల చేయడంలో కొంత ఆలస్యం చేసింది.

ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) సవరణ 3 ప్రవేశపెట్టిన తరువాత మెరుగైన బ్యాటరీ భద్రతలను కలిగి ఉన్న స్కూటర్లలో సింపుల్ వన్ ప్రధానంగా చెప్పుకోదగ్గదిగా మారింది. కావున ఈ స్కూటర్ మార్కెట్లో అమ్మకానికి రానున్న అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కానుంది.

(ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!)

కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 4.8kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 8.5 కోలోవాట్ మోటార్ ఉంటుంది. కావున 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 236 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ గతంలోనే ధ్రువీకరించింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ కూడా పొందింది, కాగా త్వరలో లాంచ్ అవుతుంది. డెలివరీలు కూడా వేగంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)