నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
వెండి ఢమాల్
Published on Fri, 06/19/2026 - 00:01
న్యూఢిల్లీ: వెండి వరుసగా రెండో రోజూ భారీ నష్టాన్ని ఎదుర్కొన్నది. కిలోకి రూ.6,660 నష్టపోయి రూ.2,48,740 వద్ద స్థిరపడింది. అటు పసిడి వరుసగా మూడో రోజూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. 10 గ్రాములకు రూ.960 నష్టంతో రూ.1,53,440 స్థాయికి దిగొచ్చింది. డాలర్‌తో రూపాయి బలపడడం, ఈక్విటీలు ఆకర్షణీయంగా మారడం పసిడి, వెండిలో నష్టాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ ఫెడ్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోయినా, వచ్చే ఏడాది కాలానికి ద్రవ్యోల్బణం, పాలసీ పరంగా కఠిన స్వరాన్ని వినిపించడం ప్రతికూల సెంటిమెంట్‌కు కారణంగా పేర్కొంటున్నారు.
‘‘ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో బంగారం ధరలు బలహీనపడ్డాయి. ఫెడ్ వ్యాఖ్యల ఆధారంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు కొనసాగిస్తే, 2026లో ఒక విడత వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న అంచనా ఏర్పడింది’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. స్థిరమైన ఆర్థిక వృద్ధికితోడు, పటిష్టమైన లేబర్ మార్కెట్ (ఉపాధి కల్పన)తో డాలర్ బలపడడం బులియన్ ధరలపై ప్రభావం చూపించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర ఔన్స్‌కు 3 శాతం నష్టంతో 4,252 డాలర్లు, వెండి ధర 6 శాతం పతనంతో 66.35 డాలర్లకు దిగొచ్చాయి.
Tags : 1