Breaking News

సిల్వర్ కొత్త మార్క్.. చరిత్రలో తొలిసారి!

Published on Mon, 01/19/2026 - 15:00

బంగారం ధరలు మాదిరిగానే వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరువలో ఉండగా.. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ. 3 లక్షలు దాటేసింది.

పెట్టుబడిదారుల డిమాండ్, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల కేజీ వెండి రూ.3 లక్షల రికార్డును అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి ఔన్సు ధర ఏకంగా 94.35 డాలర్లు పెరిగింది. ఇటీవలి సెషన్లలో బంగారం కంటే వెండికి డిమాండ్ పెరుగుతోందని.. దీనికి డాలర్ విలువ తగ్గడం కూడా సహాయపడిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజు (జనవరి 19) హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో కేజీ వెండి రేటు 8000 రూపాయలు పెరిగి, రూ. 3.18 లక్షలకు చేరింది. ముంబైలో కేజీ సిల్వర్ రేటు రూ. 10వేలు పెరిగినప్పటికీ రూ. 3.05 లక్షల వద్ద నిలిచింది. ఢిల్లీలో కూడా ఇదే రేటు వద్ద కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఊహించనంతగా పెరుగుతున్న బంగారం.. కారణమెవరు?

వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే?
వెండిని కేవలం ఆభరణాలు, కాయిన్స్ రూపంలో మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో.. ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుదలవైపు పరుగులు పెడతాయి.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)