Breaking News

ఏడాది కిందటి ధరకు వెండి

Published on Wed, 11/18/2026 - 08:11

అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ బలహీనంగా ఉండటం, రూపాయి బలపడటం తదితర కారణాలతో మంగళవారం దేశీ మార్కెట్లో వెండి, పసిడి రేట్లు క్షీణించాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 9,500 (5.3%) పతనమై రూ. 1.69,000కు పడిపోయింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. చివరిసారిగా గతేడాది నవంబర్‌ 13న వెండి రేటు ఈ స్థాయి వద్ద ట్రేడయ్యింది. నవంబర్‌ 5 నుంచి ఎనిమిది సెషన్లలో వెండి ధర ఏకంగా రూ. 25,000 (దాదాపు 13 శాతం) క్షీణించింది.

మరోవైపు, పసిడి రేటు వరుసగా ఆరో సెషన్లోనూ తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,400 క్షీణించి రూ. 1,38,600కి చేరింది. నవంబర్‌ 9 నుంచి పుత్తడి రేటు రూ. 8,300 (దాదాపు 6%) మేర తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.51 స్థాయికి బలపడటం కూడా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర పెద్దగా మార్పు లేకుండా 3,856 డాలర్ల వద్ద, వెండి 1% పెరిగి 47.44 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

కుప్పకూలిన ధరలు! తులం ఎంత అంటే?

ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ డౌన్‌లోడ్‌

బంగారం ధరలు(17.11.2026 మధ్యాహ్నం 1 వరకు) ఇలా..

Videos

వేంపల్లి నామినేషన్ కేంద్రంలో TDP గూండాలు

అనితకు షాక్... ప్రలోభాలకు టీడీపీలోకి వెళ్లిన MPTC.. తిరిగి YSRCPలో జాయిన్

దాన వీర శూరగా తారక్.. క్రేజీ టైటిల్ సెట్ చేసిన రావిపూడి...

కుల్గామ్ దాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు

HERO నుండి రూ.3 లక్షలకే ఎలక్ట్రిక్ కారు?

జక్కన్న మాస్టర్ ప్లాన్! మహేష్ లుక్ మామూలుగా లేదుగా!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దగ్గరగా బంగారం

డబ్బుకి అమ్ముడుపోతావా..? బండారు శ్రావణి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు

ఈ ఒక్క బైరెడ్డిని ఆపితే.. 100 బైరెడ్డిలు వస్తారు.. హౌస్ అరెస్ట్ పై బైరెడ్డి స్టాంగ్ రియాక్షన్

అమ్మా నేను చచ్చిపోతా..! జనసేన కేకే వ్యాఖ్యలపై ధరణి కృష్ణ ఎమోషనల్ రియాక్షన్

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ చిలుకలా మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

కొల్లేరులో శీతాకాలంలో విడిది పక్షుల సందడి (ఫోటోలు)

+5

అనంతపురం : పులకించిన పుట్టపర్తి (ఫోటోలు)

+5

బ్లాక్ డ్రస్‌లో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఇంకా దీపావళి హ్యాంగోవర్‌లోనే మాళవిక (ఫొటోలు)

+5

'ఎర్త్ షాట్ ప్రైజ్' ఈవెంట్.. రకుల్ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

వావ్ అనేలా శార్వరి వాఘ్ (ఫొటోలు)

+5

అక్కా సిరీస్‌లో కీర్తి సురేశ్ స్టిల్స్.. (ఫోటోలు)

+5

హీరోయిన్ సమంత సీమంతం వేడుక.. (ఫోటోలు)