Breaking News

వెండి వెలుగులు

Published on Fri, 06/06/2025 - 00:51

న్యూఢిల్లీ: దేశీయంగా వెండి గురువారం సరికొత్త గరిష్ట స్థాయికి చేరింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం వరుసగా నాలుగో రోజు పరుగును కొనసాగిస్తూ న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వెండి కేజీ ధర మరో రూ. 2,000 పెరిగి రూ. 1,04,100 (పన్నులు కలిపి) పలికింది. చివరిసారిగా మార్చి 19న వెండి రేటు ఆల్‌ టైమ్‌ గరిష్టమైన రూ. 1,03,500 స్థాయిని తాకింది. 

పటిష్టమైన ఫండమెంటల్స్, పరిశ్రమల నుంచి డిమాండ్, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌ సాధనంగా ఉపయోగిస్తుండటం, అంతర్జాతీయంగా సరఫరా నెమ్మదించడం తదితర అంశాల కారణంగా దేశీ మార్కెట్లో వెండి రేటు సరికొత్త ఆల్‌ టైమ్‌ గరిష్టాన్ని తాకినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ (కమోడిటీస్‌) సౌమిల్‌ గాంధీ తెలిపారు. అటు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ జూలై కాంట్రాక్టు ధర ఒక దశలో సుమారు రూ. 3,833 పెరిగి రూ. 1,05,213 వద్ద ట్రేడయ్యింది.  

పసిడి పరుగు.. 
డాలరు బలహీనత, అమెరికా రుణభారంపై ఆందోళనలు, అనిశ్చితిలో సురక్షితమైన సాధనంగా పసిడికి పేరుండటం వంటి అంశాల కారణంగా బంగారం ధర కూడా పరుగు తీస్తోంది. 99.9 శాతం స్వచ్ఛత గల పుత్తడి రేటు 10 గ్రాములకు రూ. 430 పెరిగి రూ. 99,690 వద్ద (పన్నులు కలిపి) ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం రూ. 400 పెరిగి రూ. 99,100 వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 3,395 డాలర్ల పైకి చేరగా, దేశీయంగా ఎంసీఎక్స్‌లో రూ. 98,450 వద్ద ట్రేడయినట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ వీపీ రీసెర్చ్‌ అనలిస్ట్‌ జతిన్‌ త్రివేది తెలిపారు.

దీపావళి నాటికి 
దీపావళి నాటికి  వెండి ధర రూ. 1,14,000 – రూ. 1,20,000 స్థాయికి చేరే అవకాశం ఉందని మెహతా ఈక్విటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కలాంత్రి చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితుల కారణంగా ఈలోపు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని పేర్కొన్నారు. మరోవైపు, కొత్తగా భౌగోళిక రాజకీయ పరిణామాలేమైనా తలెత్తితే మరింత అనిశ్చితికి ఆజ్యం పోసినట్లవుతుందని, దీంతో ఇన్వెస్టర్లు మళ్లీ బంగారంవైపు మొగ్గు చూపవచ్చని అబాన్స్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ సీఈవో చింతన్‌ మెహతా చెప్పారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)