Breaking News

వెండి.. భవిష్యత్తు బంగారం!

Published on Wed, 09/10/2025 - 01:38

న్యూఢిల్లీ: బంగారం మాదిరే వెండికి సైతం డిమాండ్‌ బలపడుతోంది. ఫలితంగా వెండి ధర కిలోకి రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది. బలమైన పారిశ్రామిక డిమాండ్, డాలర్‌ బలహీనత, సురక్షిత సాధనంగా పెట్టుబడుల డిమాండ్‌ ధరలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్‌ మార్కెట్లో వెండి ధర 37 శాతం పెరిగినట్టు గుర్తు చేసింది.

‘‘వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చే ఆరు నెలల్లో కిలోకి రూ.1,35,000కు చేరుకోవచ్చు. 12 నెలల్లో రూ.1,50,000కు చేరొచ్చు. డాలర్‌తో రూపాయి మారకం 88.5 శాతం స్థాయిలో ఉంటుందని భావిస్తూ వేసిన అంచనా ఇది’’అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్‌ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్‌ తొలుత ఔన్స్‌కు 45 డాలర్లు, తర్వాత 50 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.  

బలమైన డిమాండ్‌ 
2025లో వెండి మొత్తం ఉత్పత్తిలో 60 శాతం డిమాండ్‌ పారిశ్రామిక రంగం నుంచి వచ్చినట్టు యూఎస్‌కు చెందిన సిల్వర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. సోలార్‌ విద్యుత్, ఎలక్ట్రికల్‌ వాహనాలు, 5జీ ఇన్‌ఫ్రా రంగాల నుంచి వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు వెండికి డిమాండ్‌ కొనసాగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. సిల్వర్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ధరలు ఎగిసేందుకు దారితీస్తున్నట్టు పేర్కొంది.

బంగారానికి తోడు వెండిని సైతం తమ రిజర్వుల్లోకి చేర్చుకోవడానికి కొన్ని సెంట్రల్‌ బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తుండడం, వెండి మెరుపులకు తోడవుతోంది. వచ్చే మూడేళ్లలో 535 మిలియన్‌ డాలర్ల విలువైన వెండిని తమ దేశ రిజిర్వుల్లోకి చేర్చుకోనున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ ఏడాది 40 మిలియన్‌ డాలర్ల మేర సిల్వర్‌ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయనుంది.  

3,000 టన్నుల దిగుమతి
దేశీయంగానూ వెండికి డిమాండ్‌ బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,000 టన్నుల వెండి దిగుమతి అయింది. పారిశ్రామిక రంగం నుంచే కాకుండా, పెట్టుబడులకు సైతం డిమాండ్‌ నెలకొంది. ‘‘జాక్సన్‌ హోల్‌ సింపోజియం తర్వాత ఫెడ్‌ సెప్టెంబర్‌ సమావేశంలో పావు శాతం మేర రేట్లను తగ్గించడం తప్పనిసరి అని తెలుస్తోంది. తక్కువ రేట్లు, యూఎస్‌ ఈల్డ్స్‌ క్షీణిస్తుండడం విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది’’అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా స్వల్పకాలంలో లాభాల స్వీకరణను కొట్టిపారేయలేమని పేర్కొంది. ప్రస్తుత స్థాయి నుంచి, రేట్లు తగ్గిస్తే రూ.1,18,000– 1,15,000 స్థాయి వరకు వెండిని కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)