Breaking News

వెండి మిలమిల..

Published on Thu, 11/28/2024 - 05:06

న్యూఢిల్లీ: వెండి కేజీ ధర న్యూఢిల్లీ స్పాట్‌ మార్కెట్‌లో ఒకేరోజు రూ.5,200 పెరిగి రూ.95,800కు చేరింది. వెండి ధర ఒకేరోజు ఈ స్థాయిలో ఎగియడం ఒక రికార్డు. తద్వారా ఈ మెటల్‌ ధర రెండు వారాల తర్వాత తిరిగి రూ.95,000పైకి చేరింది. కాగా, ఇంతక్రితం అక్టోబర్‌ 21న వెండి ధర ఒకేరోజు రూ.5,000 పెరగడం ఒక రికార్డు.  అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, స్థానిక ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ దీనికి కారణం.  

రెండు రోజుల తర్వాత పసిడి 
ఇక గడచిన రెండు రోజుల్లో రూ.2,250 పడిపోయిన బంగారం ధర బుధవారం తిరిగి పుంజుకుంది.  99.9 ప్యూరిటీ పసిడి ధర రూ.650 ఎగసి రూ.78,800కు చేరినట్లు ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ పేర్కొంది. 99.5 శాతం స్వచ్ఛత ధర రూ.950 ఎగసి రూ.78,700కు ఎగసింది. డాలర్‌ విలువలో ఒడిదుడుకులు తాజా పసిడి పరుగుకు కారణం.  అబాన్స్‌ హోల్డింగ్స్‌ సీఈఓ చింతన్‌ మెహతా పసిడి భవిష్యత్‌ ధరలపై మాట్లాడుతూ, బులియన్‌ ధరలకు మరింత దిశానిర్దేశం చేసే రష్యా–ఉక్రెయిన్‌ వివాదం, పరిణామాలను మార్కెట్లు నిశితంగా గమనిస్తాయని అన్నారు.  

ఫ్యూచర్స్‌లో పరుగు.. 
అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ఔన్స్‌ (31.1గ్రాములు) ధర ఒక దశలో 1% పెగా (32 డాలర్లు) పెరిగి 2,679 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ ఇటీవలే పసిడి 52 వారాల గరిష్టం 2,826 డాలర్లను తాకింది.  ఆ తర్వాత లాభాల స్వీకరణ, ట్రంప్‌ గెలుపు, డాలర్‌ స్థిరత్వం వంటి పరిణామాలతో ఎల్లో మెటల్‌ కొంత వెనక్కు తగ్గింది. దేశీయ ఫ్యూచర్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో  10 గ్రాముల ధర దాదాపు రూ. 900 లాభంతో రూ. 76,870 వద్ద ట్రేడవుతోంది. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)