Breaking News

సిలికాన్‌ వ్యాలీలో ‘దేశీ’ నెట్‌వర్క్‌

Published on Wed, 05/13/2026 - 13:25

సిలికాన్ వ్యాలీలో భారతీయ నిపుణుల ఆధిపత్యంపై మరోసారి చర్చ మొదలైంది. గూగుల్‌లో పనిచేసిన ఒక మాజీ కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. భారతీయులు ఒక రహస్య నెట్‌వర్క్‌ను నడుపుతున్నారని, అనైతిక మార్గాల్లో తమ వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అటు అమెరికన్లలో, ఇటు భారతీయ టెక్కీలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఏమిటా ఆరోపణలు?

జీబీ న్యూస్ రూపొందించిన ‘హెచ్-1బీ డాక్యుమెంటరీ’ కోసం స్టీఫెన్ వివియన్ అనే మాజీ గూగుల్ కాంట్రాక్టర్ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్‌లో పనిచేసే భారతీయ ఉద్యోగులు తమ స్నేహితులకు లేదా పరిచయస్తులకు ఇంటర్వ్యూలో అడిగే రహస్య ప్రశ్నలను ముందుగానే లీక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతీయులు కేవలం ఇండియన్స్‌నే నియమించుకోవడానికి ఇష్టపడుతున్నారని, దీనివల్ల అర్హత ఉన్న ఇతరులకు అన్యాయం జరుగుతోందని వివియన్ పేర్కొన్నారు. ‘నేను ఒక భారతీయ వ్యక్తితో స్నేహం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఈ రహస్యాలు తెలిశాయి. ఇంటర్వ్యూలు పూర్తిగా గోప్యంగా ఉండాలి. కానీ వారు ఆ ప్రశ్నలను పంచుకుంటున్నారు. నిజాయితీ లేని అంశం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నెట్టింట ముదిరిన యుద్ధం

వివియన్ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మెజారిటీ నిపుణులు ఆయన మాటలను కొట్టిపారేస్తూ, భారతీయ టెక్కీల ప్రతిభను తక్కువ చేయడమేనని మండిపడుతున్నారు. ‘భారతీయులు ప్రపంచస్థాయి కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారంటే అది వారి సామర్థ్యం. ఒక కఠినమైన జాబ్ మార్కెట్‌లో పోటీ పడలేక మొత్తం జాతీయతపై నిందలు వేయడం మీ పక్షపాతాన్ని చూపిస్తుంది’ అని ఒక నెటిజన్ స్పందించారు.

ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త రిచర్డ్ హనానియా స్పందిస్తూ, ‘ఈ వ్యక్తి ఒక డెలివరీ మేనేజర్ మాత్రమే, గూగుల్‌లో కీలక నిర్ణయాధికారి కాదు. ఒక కాంట్రాక్టర్ మాటలను పట్టుకుని భారతీయ నిపుణులందరినీ స్కామర్లుగా ముద్ర వేస్తారా?’ అని ప్రశ్నించారు. అయితే, వివియన్‌కు మద్దతు ఇచ్చే వారు కూడా లేకపోలేదు. ఐటీ రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల వారు తమ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కొందరు వాదిస్తున్నారు.

ఇదీ చదవండి: బంగారం షాక్‌.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు

Videos

అసెంబ్లీలో CM విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

పూర్తి ఆధారాలతో వస్తా.. సిట్ కు బండి భగీరథ్ లేఖ

మందులు, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు విముక్తి

కేసులు పెట్టే ముందు ఆలోచించు! నూరి ఫాతిమా సీరియస్

వామ్మో బంగారం కొనలేం.. 2 లక్షలకు పెరిగే చాన్స్

అమెరికా విద్యార్థులకు బిగ్ షాక్.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై నిఘా

కృష్ణాజిల్లాలో దారుణం.. వైన్ షాప్ నిర్వాహకుడిపై టీడీపీ నేత దాడి

బండి భగీరథ్ ఎక్కడ? పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్

పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్..

కూల్ డ్రింక్ VS ఫ్రూట్ జ్యూస్...ఏది విషం? ఏది అమృతం?

Photos

+5

విడాకుల రూమర్స్.. ట్రెండింగ్‌లో మౌనీరాయ్ (ఫొటోలు)

+5

అరుణాచలం ట్రిప్‌లో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

తెలంగాణ : కోరిన కోరికలు తీర్చే అద్భుత శక్తులు కలిగిన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆలియా భట్ (ఫొటోలు)

+5

మధ్యాహ్నం 2 గంటల లోపు పీఎస్ కు రావాలని భగీరథ కు నోటీసులు

+5

గంగరంగ వైభవం గంగమ్మ జాతర...పోటెత్తిన జనం (ఫొటోలు)

+5

హనుమాన్ జయంతి... భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర...'బైరాగి వేషంలో మొక్క చెల్లించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

అనంతపురం జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

నారా రోహిత్‌ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)