రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?

Published on Sat, 01/25/2025 - 09:33

రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్‌ టూరిజం విభాగం ఐఆర్‌సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటికే ఐఆర్‌సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్‌ఫామ్‌ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్‌తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్‌డేట్‌ చేసి ఫుడ్ ఆఫర్‌ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒ‍ప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.

ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీ

చిన్న పరిశ్రమలకు మద్దతు

కేటరింగ్‌, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్‌సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్‌ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్‌సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)