Breaking News

జీఎస్‌టీ 2.0 ఎఫెక్ట్: నెలరోజుల్లో నాలుగు లక్షల వెహికల్స్!

Published on Sat, 11/15/2025 - 19:57

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ డిమాండ్, జీఎస్‌టీ 2.0 అమలు కారణంగా ధరలు దిగిరావడంతో ఆటో కంపెనీలు అక్టోబర్‌లో డీలర్లకు రికార్డు స్థాయిలో వాహనాలను సరఫరా చేశాయని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) తెలిపింది. ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక నెలలో ఇవే అత్యధిక టోకు విక్రయాలు అని పేర్కొంది. సియామ్‌ గణాంకాల ప్రకారం..

  • గత నెలలో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,60,739 ప్రయాణికుల వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్‌ సరఫరాలు 3,93,238 యూనిట్లతో పోలిస్తే ఇవి 17% అధికంగా ఉన్నాయి.  

  • వార్షిక ప్రాతిపదికన ద్విచక్రవాహనాల సరఫరా 2% పెరిగి 22,10,727 యూనిట్లకు చేరింది. స్కూటర్ల సరఫరాలు 7,21,200 యూనిట్ల నుంచి 8,24,003కు చేరాయి. అయితే మెటార్‌ సైకిళ్ల విక్రయాలు 4% తగ్గి 13,35,468 యూనిట్లకు పరిమితమయ్యాయి.

  • త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 6% పెరిగి 81,288 వాహనాలకు చేరాయి.

‘‘వ్యవస్థలో కొంత రవాణా సరఫరా సమస్యలున్నప్పట్టకీ.., అక్టోబర్‌లో ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీవీలర్స్‌లు రికార్డు స్థాయిలో డీలర్లకు సరఫరా అయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో వాహనాల కొనేవారి సంఖ్య పెరిగింది. అందుకే రిజిస్ట్రేషన్లు హోల్‌సేల్‌ కంటే అధికంగా నమోదయ్యాయి’’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.

Videos

చంద్రబాబు బుద్ది అది... రెచ్చిపోయిన CPI రామకృష్ణ

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Photos

+5

పెట్ బర్త్ డే.. హీరోయిన్ త్రిష హంగామా (ఫొటోలు)

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)