Breaking News

శ్యామ్‌ మెటాలిక్స్‌ షేర్ల జారీ

Published on Thu, 01/11/2024 - 06:12

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ శ్యామ్‌ మెటాలిక్స్‌ అండ్‌ ఎనర్జీ లిమిటెడ్‌ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్‌ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది.

కాగా.. క్విప్‌ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్‌కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్‌ క్యాపిటల్‌ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది.
క్విప్‌ నేపథ్యంలో శ్యామ్‌ మెటాలిక్స్‌ షేరు బీఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)