Breaking News

హెచ్‌డీఎఫ్‌సీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.1 లక్ష జరిమానా

Published on Fri, 07/31/2026 - 08:49

దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పాలనాపరమైన నియమ ఉల్లంఘనల కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శశిధర్ జగదీషన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) శ్రీనివాసన్ వైద్యనాథన్, రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రాలపై బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించడంతో పాటు హెచ్చరిక లేఖలు జారీ చేసింది.

కేసు నేపథ్యం

మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి 2017-21 మధ్యకాలంలో సేకరించిన భారీ డిపాజిట్లకు సంబంధించి సుమారు రూ.45 కోట్లను మార్కెటింగ్ వ్యయాలుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన స్పెషల్ డిసిప్లినరీ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి దురుద్దేశం గానీ, వ్యక్తిగత లాభార్జన ధోరణి గానీ లేనప్పటికీ తమ అధికారిక పరిధిని దాటి వ్యవహరించడం (Business Overreach) జరిగిందని కమిటీ గుర్తించింది.

ఆర్‌బీఐ నిబంధనలు.. బోర్డు నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల నుంచి పాక్షికంగా పాటించనట్లు బోర్డు భావించి స్వతంత్ర కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు చేపట్టింది. మిగిలిన సంబంధిత సిబ్బందికి కూడా హెచ్చరిక లేఖలు పంపినట్లు, ఈ అంతర్గత విచారణ వివరాలు, చేపట్టిన చర్యలను ఆర్‌బీఐకి అధికారికంగా నివేదించనున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమర్పించిన సమాచారంలో తెలిపింది.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)