Breaking News

కుమార్తెకు భారీ గిఫ్ట్: శివ్ నాడార్ కీలక నిర్ణయం

Published on Sat, 03/08/2025 - 14:35

వారసత్వ ప్రణాళికను క్రమబద్దీకరించడానికి.. ఫ్యామిలీ హోల్డింగ్‌లను ఏకీకృతం చేయడానికి, ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా.. దేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ 'శివ్ నాడార్' (Shiv Nadar) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హెచ్‌సీఎల్ కంపెనీలో మాత్రమే కాకుండా.. ప్రమోటర్ కంపెనీలైన వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్ (ఢిల్లీ) ప్రైవేట్ లిమిటెడ్‌లలోని తనకు చెందిన మొత్తంలో 47 శాతం వాటాను తన కుమార్తె 'రోష్ని నాడార్ మల్హోత్రా'కు బదిలీ చేస్తూ గిఫ్ట్ డీడ్‌లను అమలు చేశారు.

ఈ బదిలీలకు ముందు, శివ్ నాడార్.. రోష్ని నాడార్ మల్హోత్రా రెండు సంస్థలలోనూ వరుసగా 51%, 10.33% వాటాలను కలిగి ఉన్నారు. లావాదేవీల తరువాత, HCL కార్పొరేషన్, VSIPL లలో రోష్ని వాటాలు 57.33 శాతానికి పెరిగాయి, శివ్ నాడార్ వాటా 4 శాతానికి చేరుకున్నాయి.

రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra)
టెక్ దిగ్గజం, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకులు 'శివ్‌ నాడార్‌'కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్ని.. వసంత్‌ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, కెలాగ్స్‌ యూనివర్సిటీ నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సీఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సీఈఓగా బాధ్యతలు కూడా చేపట్టారు.

ఇదీ చదవండి: నెలకు ఒకరోజు సెలవు.. దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)