Breaking News

మహిళా వ్యాపారులకు షీట్రేడ్స్‌ ఇండియా హబ్‌

Published on Wed, 03/12/2025 - 08:47

న్యూఢిల్లీ: ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఎగుమతుల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో మంగళవారం షీట్రేడ్స్‌ ఇండియా హబ్‌ను ఆవిష్కరించింది. ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ సెంటర్‌ (ఐటీసీ) భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రానికి బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన షీట్రేడ్స్‌ కామన్వెల్త్‌ప్లస్‌ ప్రోగ్రాం కింద నిధులు అందుతాయి.

ఇదీ చదవండి: ఫ్రెంచ్‌ కంపెనీపై జైడస్‌ లైఫ్‌ కన్ను

ఇది మహిళల సారథ్యంలో ఎగుమతుల వృద్ధికి దోహదపడుతుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిస్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) సంతోష్‌ కుమార్‌ సారంగి తెలిపారు. ఇందులో 3 లక్షల మంది మహిళా ఎంట్రప్రెన్యూర్లను ఎన్‌రోల్‌ చేయడంపై ఎఫ్‌ఐఈవో, ఐటీసీ దృష్టి పెట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళల ఆధ్వర్యంలోని వ్యాపారాలకు వనరులను సమకూర్చే సమగ్ర కేంద్రంగా షీట్రేడ్స్‌ ఇండియా హబ్‌ ఉంటుంది. ఇందులో సామర్థ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌లు, మెంటారింగ్‌ సెషన్లు మొదలైనవి నిర్వహిస్తారు. భారత్‌ ఏటా 80,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులు, సర్వీసులు ఎగుమతి చేస్తోందని, వచ్చే కొన్నేళ్లలో దీన్ని 2 లక్షల కోట్ల డాలర్లకు చేర్చుకోవాలనేది లక్ష్యంగా నిర్దేశించుకుందని సారంగి చెప్పారు.
 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)