Breaking News

రిలయన్స్ బోర్డులోకి అంబానీ వారసులు - ఆమోదం తెలిపిన షేర్ హోల్డర్స్

Published on Fri, 10/27/2023 - 14:32

ఆయిల్ నుంచి టెలికామ్ వరకు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఈ సంస్థలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు వారి పిల్లలు కూడా ఒక్కో విభాగంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీ ముగ్గురూ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన వారసత్వ ప్రణాళికను ఈ రోజు అధికారికం చేసింది. కంపెనీ బోర్డులో ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమించడానికి వాటాదారులు ఆమోదించారు.

కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగటానికి షేర్ హోల్డర్ల నుంచి అంబానీ పిల్లలు ముగ్గురూ (ఇషా, ఆకాష్, అనంత్ అంబానీ) వరుసగా 98.21 శాతం, 98.06 శాతం, 92.75 శాతం ఆమోదం పొందారు.

ఇదీ చదవండి: ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..

ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లు
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను ముఖేష్ అంబానీ మరో ఐదేళ్లపాటు నిర్వహించనున్నారు. నీతా అంబానీ పదవీ విరమణ తరువాత కూడా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. దీనికి రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నుంచి ఆమోదం లబించింది.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు