Breaking News

అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆర్బీఐ గవర్నర్‌

Published on Wed, 06/14/2023 - 19:56

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును లండన్‌లో అందుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023 విజేతలను ఈ ఏడాది మార్చి చివరిలో ప్రకటించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డులు వచ్చాయి. 

సెంట్రల్ బ్యాంకింగ్, లండన్ జూన్‌ 13న నిర్వహించిన వేసవి సమావేశాల ప్రారంభ ప్లీనరీ సమావేశంలో శక్తికాంత దాస్‌ పాల్గొని ప్రసంగించారు. గవర్నర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును స్వీకరించారు. కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణ కట్టడికి చేసిన కృషికి గానూ ఆయనకు గుర్తింపు లభించింది.  ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి అయిన శక్తికాంత దాస్ రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో ఆర్బీఐ  25వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా G20 షెర్పా ఆఫ్ ఇండియాగా ఉన్నారు.

ఇదీ చదవండి: ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు!

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)