Breaking News

అనుకున్నదొకటి అయినదొకటి..

Published on Fri, 04/25/2025 - 08:28

ప్రముఖ కంపెనీలు కొన్ని క్యూ4లో ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ అనుకున్న విధంగా లాభాలు పోస్ట్‌ చేయలేకపోయాయి. సిమెంట్‌ తయారీ దిగ్గజం ఏసీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతంలో ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు వెలువడుతాయని అంచనా వేసినా లాభం లేకుండా పోయింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 20 శాతంపైగా క్షీణించి రూ.751 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.943 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.7.5 డివిడెండ్‌ ప్రకటించింది. సిమెంట్‌ అమ్మకాల ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 5,686 కోట్లకు చేరింది. రెడీమిక్స్‌ కాంక్రీట్‌ ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 420 కోట్లను తాకింది. దీంతో మొత్తం టర్నోవర్‌ 12 శాతం మెరుగుపడి రూ. 6,067 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 5,515 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో అమ్మకాల పరిమాణం 14 శాతం పుంజుకుని 11.9 మిలియన్‌ టన్నులను తాకింది. వెరసి ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు సాధించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 2,402 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 12 శాతం బలపడి రూ. 22,835 కోట్లకు చేరింది.  

ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’


నెస్లే ఇండియా లాభం డౌన్‌

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 6 శాతంపైగా క్షీణించి రూ. 873 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం వృద్ధితో రూ. 5,448 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 5,254 కోట్ల అమ్మకాలు సాధించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ.3,208 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 జులైలో పదవీ విరమణ చేయనున్న చైర్మన్, ఎండీ సురేష్‌ నారాయణన్‌ స్థానే 2025 ఆగస్ట్‌ 1 నుంచి మనీష్‌ తివారీ ఎండీగా బాధ్యతలు చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)