Breaking News

డబ్బు సంపాదనకు ‘స్మార్ట్‌’ సూచన

Published on Sat, 06/14/2025 - 12:49

‘స్మార్ట్’ ఫైనాన్షియల్‌ ప్లానింగ్ ఆర్థిక కలలను నిజం చేస్తుంది. కొందరు మంచి కారు కొనాలనుకుంటారు.. కొందరికి ఖరీదైనా ఫోన్‌ కావాలనిపిస్తుంది.. ఇంకొందరు కాలేజ్‌ ఫీజు కోసం పొదుపు చేస్తారు.. ఇలా ఒక్కొక్కరి ఆర్థిక అవసరాలు ఒక్కో రకంగా ఉంటాయి. అయితే వారి ఆర్థిక లక్ష్యాలను సరైన మార్గంలో సెట్ చేసుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తే భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు పడ్సాలిందేనని నిపుణులు చెబుతున్నారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే ముందు ‘స్మార్ట్‌(SMART)’ పద్ధతులను అవలంభించాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉద్యోగం సాధించిన యువత కింద తెలిపిన పద్ధతులను పాటిస్తే తప్పకుండా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారని తెలుపుతున్నారు.

స్మార్ట్ లక్ష్యాలు

SMART

  • Specific

  • Measurable

  • Achievable

  • Realistic

  • Time-bound

నిర్దిష్ట లక్ష్యాలు(Specific): మీకు ఆర్థికంగా ఏమి కావాలో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. ‘నేను డబ్బు ఆదా చేయాలనుకుంటున్నాను’ అని చెప్పడానికి ముందు కచ్చితమైన లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. ‘నేను దేని కోసం పొదుపు చేస్తున్నాను? నాకు ఎంత డబ్బు అవసరం?..’ అనే అంశాలపై స్పష్టత ఉండాలి.

కొలవదగినదై ఉండాలి..(Measurable): మీ లక్ష్యాలను మీ ఆదాయంతో పోల్చి చూసుకొని ఖర్చులు, ఆదాపై పురోగతిని ట్రాక్ చేయాలి. తక్కువ జీతంల ఉన్నవారు ఆచరణ సాధ్యం కాని భారీ లక్ష్యాలను పెట్టుకోవడంలో అర్థం ఉండదు.

సాధించేదిగా ఉండాలి..(Achievable): మీ ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగా లెక్కలు పక్కాగా చూసుకుంటూ..లక్ష్యాన్ని సాధించాలి. లెక్కల విషయంలో నిజాయితీగా ఉండాలి. అసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం నిరాశకు దారితీస్తుంది.

ఇదీ చదవండి: పరుగాపని పసిడి.. రూ.1లక్ష దాటినా మంట తగ్గలేదు!

వాస్తవికతకు దగ్గరగా..(Realistic): మీ లక్ష్యం మీ ప్రస్తుత జీవిత పరిస్థితికి సరిపోయేలా వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఆర్థిక లక్ష్యానికి కట్టుబడి ఉండేలా స్వీయ క్రమశిక్షణతో మెలగాలి.

కాలపరిమితి(Time-bound): ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసేలా కాలపరిమితిని నిర్ధారించుకోవాలి. డెడ్ లైన్ ఉంటే మరింత మెరుగ్గా పొదుపుపై దృష్టి సారించేందుకు వీలవుతుంది.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు