Breaking News

సేవల రంగం స్లో డౌన్‌.. రెండేళ్ల తర్వాత ఇదే ప్రథమం

Published on Thu, 02/06/2025 - 07:46

న్యూఢిల్లీ: అమ్మకాలు, ఉత్పత్తి ఒక మోస్తరుగానే పెరుగుతున్న నేపథ్యంలో జనవరిలో దేశీయంగా సేవల రంగం (Services sector) వృద్ధి నెమ్మదించింది. డిసెంబర్‌లో 59.3గా ఉన్న హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ 56.5కి పరిమితమైంది. రెండేళ్ళ  తర్వాత వృద్ధి ఇంతగా నెమ్మదించడం ఇదే ప్రథమం.

పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి పైన ఉంటే వృద్ధిని, దానికన్నా తక్కువుంటే క్షీణతను సూచిస్తుంది. బిజినెస్‌ యాక్టివిటీ, కొత్త బిజినెస్‌ పీఎంఐ సూచీలు వరుసగా 2022 నవంబర్, 2023 నవంబర్‌ తర్వాత కనిష్ట స్థాయులకు తగ్గినట్లు హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ ఇండియా ఎకానమిస్ట్‌ ప్రాంజల్‌ భండారీ తెలిపారు.

సిబ్బంది ఖర్చులు, ఆహార ధరలు పెరిగిపోతుండటంతో సర్వీస్‌ కంపెనీల వ్యయాలు కూడా మరింత పెరిగాయి. అయితే, రాబోయే 12 నెలల్లో వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా పుంజుకుంటాయని దేశీయంగా సర్వీస్‌ ప్రొవైడర్లు ధీమాగా ఉన్నారు. ప్రకటనలు, పోటీ సంస్థలతో పోలిస్తే మెరుగైన రేట్లు ఆఫర్‌ చేయడం, కొత్త క్లయింట్ల ఎంక్వైరీలు మొదలైన అంశాలు ఇందుకు కారణం. సర్వీస్‌ రంగానికి చెందిన 400 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రూపొందిస్తుంది.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)