Breaking News

జీఎస్టీ తోడు.. ఇక ఇల్లు కట్టొచ్చు చూడు!

Published on Fri, 09/19/2025 - 21:33

కేంద్రం ప్రభుత్వ​ం​ వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని సవరించింది. జీఎస్టీ సంస్కరణలు దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రధానమైన సానుకూల మార్పు కానున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ 2.0 నిర్మాణ రంగానికి పెద్ద ఉపశమనమే కలిగిస్తుంది. సామాన్యుల సొంతింటి కల సాకారానికి కాస్త సాయం చేయనుంది.

నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగులు వంటి పలు నిర్మాణ సామగ్రి ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది.

ఏ నిర్మాణ సామగ్రిపై జీఎస్టీ ఎంతంటే?

➤సిమెంట్, రెడీమిక్స్‌ కాంక్రీట్‌(ఆర్‌ఎంసీ): గతంలో 28 శాతం జీఎస్టీ ఉండగా.. 18 శాతానికి తగ్గింది.

➤టైల్స్, ఇసుక, ఇటుకలు: 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.

➤రంగులు, వార్నిష్: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.

➤మార్బుల్, గ్రానైట్‌: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.

➤సహజ ఇసుక: 5 శాతం ఉండగా.. సున్నా శాతానికి తగ్గింది.

➤స్టోన్‌ ఇన్‌లే వర్క్‌: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.

➤వుడెన్‌ ఫ్లోరింగ్‌: 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది.

➤వెదురు ఫ్లోరింగ్‌: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.

➤సానిటరీవేర్‌: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.

➤పీవీసీ, యూపీవీసీ పైపులు, ఫిట్టింగ్‌లు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.

➤ఇనుము, ఉక్కు ఉత్పత్తులు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.

➤వాల్‌పేపర్లు: 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది

➤కరెంట్‌ వైర్లు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.

➤ప్లైవుడ్‌, పార్టికల్‌, ఫైబర్‌ బోర్డులు: 18 శాతం నుంచి సున్నా శాతానికి తగ్గింది.

➤హ్యుండ్‌మేడ్‌ కార్పెట్లు, ఫ్లోర్‌ కార్వింగ్‌లు: 12 శాతం ఉండగా.. 5 శాతానికి తగ్గింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)