Breaking News

66 వేల దిగువకు సెన్సెక్స్‌

Published on Wed, 09/27/2023 - 00:53

ముంబై: ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమిత శ్రేణిలో బలహీనంగా కదలాడాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడి పెంచాయి.

ఇంట్రాడేలో 158 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 78 పాయింట్లు నష్టపోయి 66వేల దిగువున 65,945 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పది పాయింట్లను కోల్పోయి 19,665 వద్ద నిలిచింది. పారిశ్రామిక, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, టెలికాం షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.693 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.715 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. 

  • మనోజ్‌ వైభవ్‌ జెమ్స్‌ ఎన్‌ జ్యువెల్లరీ ఐపీఓకు 2.25 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ మొత్తం 91.20 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 2.05 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. సంస్థాగతేతర కోటా 5.18 రెట్లు, రిటైల్‌ విభాగం 1.66 రెట్లు సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి.  
  • నష్టాల మార్కెట్లో స్మాల్‌ క్యాప్‌ షేర్లు మెరిశాయి. శ్రేయాస్‌ షిప్పింగ్‌ 20%, ఐఎఫ్‌సీఐ 12%, కొచి్చన్‌ షిప్‌యార్డ్‌ 11%, ఎన్‌ఐఐటీ 10%, ఓమాక్స్‌ 9% అశోకా బిల్డ్‌కాన్‌ 8%, ఎన్‌సీసీ, అపార్‌ ఇండస్ట్రీస్, ఎంటార్‌ షేర్లు 7% ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ అరశాతం వరకు లాభపడింది.  
  •  గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెఫ్పరీస్‌.., షేరు టార్గెట్‌ ధరను రూ.4,000 నుంచి రూ.4,150కి పెంచడంతో ఐషర్‌ మోటార్స్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్‌ఈలో 2.5% బలపడి రూ.3471 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.3539 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.  
  • ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు యోచన నేపథ్యంలో డిమాండ్‌ రికవరీ ఆలస్యం అవ్వొచ్చనే అంచనాలతో ఐటీ రంగ షేర్లు డీలాపడ్డాయి. ఎంఫసీస్, కోఫోర్జ్, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌  2–1% నష్టపోయాయి.  
  • బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పాజిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయింపుతో వరుణ్‌ బేవరేజెస్‌ షేరు ఐదున్నర శాతం ర్యాలీ చేసి రూ.975 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి నాలుగున్నర శాతం లాభపడి రూ.967 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో మొత్తం 29 లక్షల షేర్లు చేతులు మారాయి.  
  • రూపాయి విలువ రెండోరోజూ కరిగిపోయింది. డాలర్‌ మారకంలో 15 పైసలు బలహీనపడి 83.28  వద్ద స్థిరపడింది. క్రూడ్‌æ ధరలు పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, బలహీన ఈక్విటీ మార్కెట్‌  దేశీ కరెన్సీ క్షీణతకు కారణమయ్యాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)