Breaking News

స్పెషలిస్టులకే డిమాండ్‌..!

Published on Thu, 09/25/2025 - 04:31

ముంబై: దేశీయంగా సెమీకండక్టర్‌ డిజైన్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాల ధోరణి నెమ్మదిగా మారుతోంది. భారీ పరిమాణంలో రిక్రూట్‌మెంట్‌ చేపట్టకుండా ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కోసమే హైరింగ్‌ చేయడం వైపు జీసీసీలు మొగ్గు చూపుతున్నాయి. కెరియర్‌నెట్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో టాప్‌ 50 సెమీకండక్టర్‌ డిజైన్‌ జీసీసీల్లో మొత్తం హైరింగ్‌ పరిమాణం 22 శాతం క్షీణించింది. ప్రత్యేక విభాగాల్లో విశిష్టమైన నైపుణ్యాలున్న స్పెషలిస్టులకు మాత్రం డిమాండ్‌ పెరుగుతోంది. 

ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, విస్తృత సంఖ్యలో ఎంఎస్‌ఎంఈలు, ఏఐ..క్లౌడ్‌ సాంకేతికతల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలున్న ప్రతిభావంతుల లభ్యత, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలు మొదలైనవాటి ఊతంతో సెమీకండక్టర్‌ డిజైన్‌లో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని కెరియర్‌నెట్‌ సీబీవో నీలభ్‌ శుక్లా తెలిపారు. 

మొత్తం హైరింగ్‌ పరిమాణం నెమ్మదిస్తున్నప్పటికీ, విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులకు డిమాండ్‌ పెరుగుతుండటమనేది.. పరిమాణం కన్నా నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 79 భారీ, మధ్య స్థాయి, స్టార్టప్‌ సెమీకండక్టర్‌ డిజైన్‌ జీసీసీల జాబ్‌ పోస్టింగ్‌ డేటా ఆధారంగా కెరియర్‌నెట్‌ ఈ నివేదికను రూపొందించింది.  
 
వీఎల్‌ఎస్‌ఐ నిపుణులకు ప్రాధాన్యం.. 
సెమీకండక్టర్‌ డిజైన్‌ జీసీసీల్లో హైరింగ్‌కి సంబంధించి వీఎల్‌ఎస్‌ఐ నిపుణులకు (48 శాతం) అత్యంత ప్రాధాన్యం ఉంటోంది. ఇక, సిస్టం అండ్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ (35 శాతం), బిజినెస్‌ ఆపరేషన్స్‌/ఐటీ సపోర్ట్‌ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ విభాగాల్లోనూ అంతర్గతంగా డిజిటల్‌ డిజైనర్లు (15 శాతం), వెరిఫికేషన్‌ స్పెషలిస్టులు (10 శాతం), సిస్టం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లకు (10 శాతం) ప్రాధాన్యం లభిస్తోంది. అలాగే అనలాగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, ఫర్మ్‌వేర్‌ మొదలైన విభాగాల్లోనూ నిపుణులకు డిమాండ్‌ ఉంటోంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)