Breaking News

క్లబ్‌హౌస్‌లోనే.. సేఫ్టీ లాకర్‌!

Published on Sat, 08/23/2025 - 13:31

సాక్షి, సిటీబ్యూరో:  భారతీయులకు సంపద అనేది కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాదు.. అదో భావోద్వేగాలతో ముడిపడిన అంశం కూడా.. అందుకే సంపాదించడమే కాదు సంపదను భద్రపరుచుకునేందుకూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. బ్యాంక్‌లు, ప్రైవేట్‌ సంస్థలు సేఫ్టీ లాకర్ల సేవలు అందిస్తున్నా.. వాటి పనిదినాల్లో తప్ప 24/7 వాటిని వినియోగించుకోలేం. అలా కాకుండా క్లబ్‌హౌస్‌లో, నివాస సముదాయంలోనే సాయుధ దళాల వంటి భద్రత ఉంటే ఎంత బాగుంటుందో కదూ. ఈమేరకు దేశంలోనే తొలి సేఫ్టీ డిపాజిట్‌ లాకర్‌ సేవల సంస్థ ఆరంతో ప్రముఖ నిర్మాణ సంస్థ సత్త్వా గ్రూప్‌ చేతులు కలిపింది.

ఎంత విలాసవంతమైన నివాస సముదాయంలో ఉన్నా సరే బంగారం, డబ్బు, ఆస్తి పత్రాలకు భద్రత విషయంలో కాస్త భయాందోళనలు ఉంటూనే ఉంటాయి. సాధారణంగా నివాస సముదాయాలలో జిమ్, స్విమ్మింగ్‌ పూల్, ప్లే ఏరియా వంటివి ఉంటాయి. కానీ, నివాసితుల సంపదకు భద్రత, సౌకర్యవంతం కలిగించడం వసతుల్లో భాగమే. కస్టమర్ల సంపదకు గోప్యత, సౌలభ్యం, ఆనందం, భద్రత అందించడమే వీటి ప్రత్యేకతలు.

భద్రత, బీమా.. 
బీఐఎస్, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మిలిటరీ గ్రేడ్‌ వాల్ట్‌తో స్టోరేజ్‌ స్పేస్‌ ఉంటుంది. ప్రతీ లాకర్‌కు బయోమెట్రిక్‌ ఉంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా చొరబడితే గుర్తించే నిఘా వ్యవస్థ ఉంటుంది. ప్రతి లాకర్‌కు రూ.కోటి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే లాకర్‌ లోపల ఏముందో ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేయవచ్చు. దీంతో మీ సంపద ఎల్లవేళలా మీ నియంత్రణలోనే ఉంటుంది.

కస్టమర్ల బంగారం, వజ్రాలు వంటి ఆభరణాలను సేఫ్టీ లాకర్‌లో భద్రపరిచే ముందు, తర్వాత వినియోగించిన ప్రతీసారి మీ కళ్లముందే తూకం వేస్తారు. ఏళ్ల పాటు బ్యాంక్‌ లాకర్ల వెయిటింగ్‌ జాబితాలు ఉండటం, అధిక విలువ డిపాజిట్‌లు, యాక్సెస్‌ పరిమితంగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి.

అయితే వీటిల్లో మాత్రం కమ్యూనిటీలోని క్లబ్‌హౌస్‌లోనే ఈ సేఫ్టీ లాకర్‌ ఉంటుంది. దీంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నివాసితులకు 24/7 అందుబాటులో ఉంటుంది. అందులోనే డ్రెస్సింగ్‌ రూమ్‌ కూడా ఉంటుంది. దీంతో ఆభరణాల వంటివి అలంకరించుకొని బయటకు రావొచ్చు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)