Breaking News

పదేళ్ల చరిత్ర.. సెక్షన్‌ 80Cలో ఎన్నో ఆప్షన్లు

Published on Mon, 05/19/2025 - 08:06

ఈ సెక్షన్‌ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్‌కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్‌ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్‌ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ...  
🔸    తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా  
🔸    డిఫర్డ్‌ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు 
🔸    ఈపీఎఫ్‌/జీపీఎఫ్‌/ సూపర్‌ యాన్యుయేషన్‌ ఫండ్‌కి చెల్లింపులు  
🔸    సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు  
🔸    నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్లలో  VIII,  IX ఇష్యూలు 
🔸    అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్‌మెంట్లు  
🔸    పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో జమలు 
🔸    సీనియర్‌ సిటిజన్స్‌ స్కీము 2024లో పెట్టుబడులు 
 

🔸    యూటీఐ యూలిప్‌ పాలసీ 1971కి జమలు, ఎల్‌ఐసీ జమలు 
🔸    ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌కి జమలు  
🔸    ఎల్‌ఐసీ యాన్యుటీ ప్లాన్‌/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్‌ధార, కొత్త జీవన్‌ అక్షయ  ఐఐ,  ఐఐఐ ప్లాన్లు, జీవన్‌ధార అక్షయ   
🔸    యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్‌ ఫండ్‌  
🔸    నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) వారికి చేసిన చెల్లింపులు  
🔸    బ్యాంకు/ఎల్‌ఐసీ/ఎన్‌హెచ్‌బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు  
🔸    పిల్లల స్కూల్‌ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే) 
🔸    ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు 
🔸    షెడ్యూల్డ్‌ బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు 
🔸    నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు 
🔸    ఇన్యూరెన్స్‌ పాలసీ (డిఫర్డ్‌ యాన్యుటీ పాలసీ మినహా) 
🔸    ఇంటి రిజిస్టేషన్‌ కోసం చెల్లించే రిజిస్టేషన్‌ ఫీజులు, స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులు. 
ఇలా సెక్షన్‌ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు. 

ఇతరత్రా విషయాలు.. 
🔸    ప్రావిడెండ్‌ ఫండ్‌కి చేసే చెల్లింపులు, లోన్‌ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు. 
🔸    ఇంటి రిజిస్ట్రేషన్‌ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు.  
🔸    ట్యూషన్‌ ఫీజుకే మినహాయింపులు. డెవలప్‌మెంట్, డొనేషన్స్‌ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు. 
🔸    లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్‌ అష్యూర్డ్‌లో 10 శాతం దాటకూడదు. 
🔸  సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)