Breaking News

డిమాండ్‌కి తగినంత బొగ్గు సరఫరా

Published on Tue, 03/17/2026 - 08:36

దేశీయంగా డిమాండ్‌కి సరిపడేంత బొగ్గును సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కోల్‌ ఇండియాలో భాగమైన సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ (ఎస్‌ఈసీఎల్‌) సీఎండీ హరీష్‌ దుహాన్‌ తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 2.3 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్‌ రంగం నుంచి డిమాండ్‌ పెరిగినా ఇవి సరిపోతాయని వివరించారు. వీటితో పాటు సత్వరం వెలికితీసేందుకు వీలుగా 1.2 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే మైనింగ్‌ కార్యకలాపాల కోసం తగినంత స్థలం, ఇతరత్రా మైనింగ్‌..రవాణా కాంట్రాక్టులు కూడా ఉన్నట్లు హరీష్‌ తెలిపారు.

ఇక తాము సరఫరా చేసే విద్యుత్‌ ప్లాంట్ల వద్ద కూడా తగినన్ని బొగ్గు నిల్వలు ఉండటం వల్ల విద్యుదుత్పత్తికి అవరోధాలు లేకుండా స్థిరంగా కొనసాగేందుకు వీలవుతుందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులకు విఘాతం ఏర్పడి బొగ్గు, విద్యుత్‌ రంగాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో హరీష్‌ భరోసా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్‌టీపీసీ, రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ఉత్పాదన్‌ నిగమ్, మధ్యప్రదేశ్‌ పవర్‌ జనరేటింగ్‌ కంపెనీ లాంటి దిగ్గజ విద్యుదుత్పత్తి సంస్థలకు కంపెనీ బొగ్గు సరఫరా చేస్తోంది.

ఇదీ చదవండి: దేశంలోనే టాప్‌ 10 రుణ ఎగవేతదారులు

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)