Breaking News

అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం

Published on Thu, 11/07/2024 - 14:50

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనిల్ అంబానీకి మళ్ళీ గట్టి ఎదురుదెబ్బ తెగిలింది. రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలపై మూడేళ్లపాటు టెండర్లలో బిడ్డింగ్ చేయకుండా 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (SECI) నిషేధం విధించింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

SECI తన టెండర్ ప్రక్రియలో భాగంగా జూన్‌లో 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ స్టాండలోన్‌ బ్యాటరీ ఎనర్జీ వంటి వాటికి బిడ్‌లను ఆహ్వానించింది. ఆ సమయంలో అనిల్ అంబానీకి చెందిన సంస్థలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేయడం మాత్రమే కాకుండా.. రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ సమర్పించిన బిడ్‌ను రద్దు చేసి నిషేదించింది.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలలో SECI డిబార్‌మెంట్ ఒకటి. అంత కంటే ముందు ఆగస్టులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంబానీని సెక్యూరిటీల మార్కెట్ నుంచి ఐదేళ్లపాటు నిషేధించి, రూ. 25 కోట్ల జరిమానా కూడా విధించింది. అక్టోబర్‏లో సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సెబీని పెనాల్టీ వసూలు చేయకుండా నిలిపివేసినప్పటికీ, సెక్యూరిటీల మార్కెట్ నుంచి డిబార్‌మెంట్ కొనసాగుతోంది.

రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ జారీ చేసిన సాధారణ ప్రయోజన రుణాలకు సంబంధించిన కేసులో కూడా సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ అంబానీ 2016లో పిపావావ్ షిప్‌యార్డ్‌ను కొనుగోలు చేయడంలో భారీగా పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత దానిని రిలయన్స్ నావల్ & ఇంజినీరింగ్‌గా మార్చారు. ఇది కూడా ఊహించనిరీతిలో ముందుకు వెళ్లలేకపోయింది. చివరకు దానిని విక్రయించాల్సి వచ్చింది.

Videos

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)