Breaking News

ఫలితాలతోపాటే వేగంగా వార్షిక నివేదికలు

Published on Sat, 06/14/2025 - 05:06

ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్‌వోలకు సూచించింది. ఆడిట్‌ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్‌వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్‌టైమ్‌ సభ్యుడు అనంత నారాయణ్‌ కోరారు. 

సీఎఫ్‌వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్‌వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్‌ రిపోర్ట్‌ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్‌ పేర్కొన్నారు.    

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)