Breaking News

సెబీ కొత్త రూల్స్: ఏప్రిల్‌ 1 నుంచే..

Published on Sun, 03/23/2025 - 07:31

న్యూఢిల్లీ: అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో (ఏఎంసీలు/మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు) పనిచేసే ఉద్యోగులకు సెబీ నిబంధనల పరంగా ఊరట కల్పించింది. మఖ్య నిర్వహణ అధికారి (సీఈవో), ముఖ్య పెట్టుబడుల అధికారి (సీఐవో), ఫండ్‌ మేనేజర్లు తదితర ఎంపిక చేసిన కీలక ఉద్యోగులు తమ వార్షిక వేతనంలో 20 శాతం మేర తమ సంస్థ నిర్వహిస్తున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోనే ఇన్వెస్ట్‌ చేయాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేసిన పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్‌ ఉంటుంది. దీన్నే ‘స్కిన్‌ ఇన్‌ ద గేమ్’గా చెబుతారు.

ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనల అమలులో కొంత ఉపశమనాన్ని సెబీ కల్పించింది. స్థూల వార్షిక పారితోషికం ఆధారంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల ఉద్యోగులు సొంత నిర్వహణ పథకాల్లో చేయాల్సిన పెట్టుబడుల శాతంలో మార్పులు చేసింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఉద్యోగుల నైతిక నడవడిక, సొంత పథకాల నిర్వహణలో బాధ్యతను పెంచడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఇందులోని ఉద్దేశ్యాలుగా ఉన్నాయి.

కొత్త నిబంధనలు..

  • కొత్త నిబంధనల కింద రూ.25 లక్షలకు మించని వేతనం ఉన్న వారు సొంత మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు.
  • రూ.25 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు 10 శాతం ఇన్వెస్ట్‌ చేయాలి. ఇసాప్‌లు/ఉద్యోగ స్టాక్‌ ఆప్షన్లు కూడా కలుపుకుంటే 12.5% పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
  • రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య వేతనం ఉన్న వారు కనీసం 14 శాతం మేర (ఒకవేళ స్టాక్‌ ఆప్షన్లు కూడా ఉంటే 17.5 శాతం) పెట్టుబడులు పెట్టాలి.

#

Tags : 1

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)