Breaking News

సెబీ సభ్యుల ఆస్తుల వివరాల వెల్లడికి ప్రతిపాదనలు

Published on Tue, 03/25/2025 - 10:54

సెబీ బోర్డు సభ్యులు, అధికారుల ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేసేలా సమగ్ర నిబంధనలపై సమీక్ష నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సెబీ యోచిస్తోంది. ఇటీవల సెబీ కొత్త ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్‌ వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్‌పర్సన్‌ మాధవిపురి బచ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారుల లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

సెబీ ప్రతిపాదిత నిర్ణయంలో భాగంగా అధికారులు, సభ్యులు, ఇతర సిబ్బంది ఆస్తులు, అప్పులు, పెట్టుబడులకు సంబంధించి వివరాల వెల్లడి, పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలపై కమిటీ సమీక్ష నిర్వహించనుంది. సెబీపై మరింతగా విశ్వాసం పెంపొందించాలంటే ఈ నిబంధనలను సమీక్షించాలని పాండే తెలిపారు. బోర్డు సభ్యులు, అధికారుల నైతిక ప్రవర్తన, జవాబుదారీతనం, పారదర్శకతను నెలకొల్పాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఏడాది చార్జీని ముందే తీసుకోవచ్చు

పెట్టుబడుల సలహాదారులు (ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు), పరిశోధన విశ్లేషకులు (రీసెర్చ్‌ అనలిస్టులు) తమ సేవలకు సంబంధించి ఏడాది కాల చార్జీని ముందుగానే క్లయింట్ల నుంచి తీసుకునేందుకు అనుమతించాలని సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్లు క్లయింట్ల ఆమోదం మేరకు రెండు త్రైమాసికాల చార్జీలనే (ఆరు నెలలు) ముందస్తుగా తీసుకునేందుకు అనుమతి ఉంది. అదే, రీసెర్చ్‌ అనలిస్టులు అయితే ఒక త్రైమాసికం చార్జీలనే ముందుగా తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?

‘ఐఏలు, ఆర్‌ఏలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో.. క్లయింట్లు సమ్మతిస్తే ఏడాది కాల ఫీజులను ముందుగానే తీసుకునేందుకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది’ అని సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ఫీజుల పరిమితులు, చెల్లింపుల విధానాలు, రిఫండ్‌లు, బ్రేకేజ్‌ ఫీజులకు సంబంధించి నిబంధనల అమలు కేవలం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌) క్లయింట్లకే పరిమితమని స్పష్టం చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)