Breaking News

సెబీ చైర్మన్‌ కీలక ప్రకటన.. ఎస్‌ఎంఈల్లో..

Published on Thu, 02/12/2026 - 18:44

న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్‌ఎంఈ) అభివృద్ధి కోసం గతంలో పలు చర్యలు తీసుకున్నప్పటికీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ కోణంలో అవి ఇంకా భారీగా విస్తరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. మార్కెట్స్‌లో లిస్ట్‌ కావడం వల్ల చిన్న కంపెనీల్లో గవర్నెన్స్‌ మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. కానీ క్యాపిటల్‌ మార్కెట్స్‌ గురించి అంతగా తెలియకపోవడం వల్ల, మర్చంట్‌ బ్యాంకర్లు అంత తేలిగ్గా దొరక్కపోవడం వల్ల చిన్న సంస్థలు లిస్టింగ్‌పై సందేహిస్తుంటాయని పేర్కొన్నారు.

ఐపీవోల ద్వారా నిధులను సమీకరించేందుకు వ్యయాల భారం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చని ఇండియా ఎస్‌ఎంఈ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. మార్కెట్ల నుంచి నిధులను సమీకరించడం వల్ల గవర్నెన్స్‌ మెరుగుపడుతుందని, విశ్వసనీయత పెరగడం వల్ల పెట్టుబడి వ్యయాలు కూడా తగ్గుతాయని పాండే చెప్పారు. చిన్న సంస్థలకి వర్తించే మినహాయింపులను కొన్ని సంస్థలు దుర్వినియోగం చేయడం వల్ల ఎస్‌ఎంఈ ఐపీవోలపై ఇన్వెస్టర్లలో ప్రతికూల సెంటిమెంటుకి దారి తీసిందని ఆయన తెలిపారు. అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా నిబంధనలను సెబీ, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మెరుగుపర్చాయన్నారు.

ఎస్‌ఎంఈ ఎక్స్ఛేంజీల్లో 1,400 కంపెనీలు లిస్టయ్యాయని, వాటి మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 4.1 లక్షల కోట్లని పాండే చెప్పారు. ఇందులో 350 సంస్థలు మెయిన్‌ బోర్డుకి మైగ్రేట్‌ అయ్యాయని గర్గ్‌ వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా 98 సంస్థలు రూ. 9,800 కోట్లు సమీకరించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 232 లిస్టింగ్స్‌ ద్వారా రూ. 10,500 కోట్లకు సమీకరించినట్లు చెప్పారు.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)