ఐపీవో గ్రే మార్కెట్‌కు సెబీ చెక్‌

Published on Fri, 08/22/2025 - 04:49

ముంబై: ఐపీవోకంటే ముందు(ప్రీ ఐపీవో) లావాదేవీల నిర్వహణకు అధికారిక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్సన్‌ తుహిన్‌ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుత అనధికార(గ్రే) మార్కెట్‌ లావాదేవీలకు చెక్‌ పెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. వెరసి నియంత్రణలకు లోబడి ప్రీఐపీవో లావాదేవీలు చేపట్టేందుకు కొత్త ప్లాట్‌ఫామ్‌ ఇన్వెస్టర్లను అనుమతించనుంది.  ఐపీవో కేటాయింపులు(అలాట్‌మెంట్‌), స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ మధ్య మూడు రోజులపాటు లావాదేవీలకు వీలు కల్పించనుంది. 

దీంతో ప్రస్తుత గ్రే మార్కెట్‌ స్థానే నియంత్రిత లావాదేవీల ప్లాట్‌ఫామ్‌కు సెబీ తెరతీయనున్నట్లు పాండే వెల్లడించారు. అయితే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రీలిస్టింగ్‌ సమాచారం ఒక్కటే సరిపోదని 2025 ఫిక్కీ క్యాపిటల్‌ మార్కెట్‌ సదస్సు సందర్భంగా సెబీ చీఫ్‌ స్పష్టం చేశారు. క్యాపిటల్‌ మార్కెట్లను మరింత విస్తరించడంతోపాటు.. ఇన్వెస్టర్ల పరిరక్షణకు వీలుగా నియంత్రణలతోకూడిన ప్రీఐపీవో ట్రేడింగ్‌ను పరిశీలనాత్మకంగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు.

నగదు ఈక్విటీ మార్కెట్‌పై దృష్టిఈక్విటీ డెరివేటివ్స్‌ గడువు(ఎక్స్‌పైరీ)లోనూ మార్పులు చేపట్టనున్నట్లు పాండే సంకేతమిచ్చారు. వీటి కాలావధి, ఎక్స్‌పైరీని ఒక క్రమపద్ధతిలో పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గతేడాది(2024–25) 91 శాతం వ్యక్తిగత ట్రేడర్లు నష్టపోయిన ఇలాంటి ప్రొడక్టులకు కళ్లెం వేసే వీలుంటుందని పేర్కొన్నారు. నగదు ఈక్విటీ మార్కెట్లను విస్తరించే బాటలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో మార్పులు తీసుకురానున్నట్లు తెలియజేశారు. 

దీర్ఘకాలిక గడువుగల ప్రొడక్టులను ప్రవేశపెట్టడంతో డెరివేటివ్స్‌ నాణ్యతను సైతం పెంచే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే సంబంధిత వర్గాలతో చర్చలు చేపట్టాక, ఒక క్రమపద్ధతిలో డెరివేటివ్‌ ప్రొడక్టుల మెచూరిటీపై నిర్ణయించనున్నట్లు తెలియజేశారు. దీంతో హెడ్జింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు దన్నునివ్వనున్నట్లు వివరించారు. నగదు విభాగంలో పరిమాణం భారీగా పెరుగుతున్నట్లు వెల్లడించారు. గత మూడేళ్లలో లావాదేవీల పరిమాణం రెట్టింపైనట్లు తెలియజేశారు. పారదర్శకత కీలకమని, దీంతో క్యాపిటల్‌ మార్కెట్లలో నిధుల సమీకరణకు  వీలుంటుందని వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)