డిజిటల్‌ గోల్డ్‌ను నియంత్రించం 

Published on Sat, 11/22/2025 - 03:48

న్యూఢిల్లీ: డిజిటల్‌ బంగారం లేదా ఈ–బంగారం వంటి ఉత్పత్తులను నియంత్రించాలనుకోవడం లేదని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే స్పష్టం చేశారు. ఇవి తమ పరిధిలోకి రావన్నారు. రీట్, ఇని్వట్‌–2025 జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే గోల్డ్‌ ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) లేదా ట్రేడింగ్‌కు వీలయ్యే ఇతర బంగారం సెక్యూరిటీలనే సెబీ నియంత్రిస్తున్నట్టు చెప్పారు.

 నియంత్రణల పరిధిలో లేని డిజిటల్‌ గోల్డ్‌ లేదా ఈ–గోల్డ్‌లో లావాదేవీలతో రిస్క్‌  ఉందంటూ.. వీటికి దూరంగా ఉండాలంటూ ఇటీవలే సెబీ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ‘‘ఆ తరహా డిజిటల్‌ గోల్డ్‌ ఉత్పత్తులు సెబీ నియంత్రించే బంగారం ఉత్పత్తులకు భిన్నమైనవి. వాటిని సెక్యూరిటీలుగా లేదా కమోడిటీ డెరివేటివ్‌లుగా నోటిఫై చేయలేదు. అవి పూర్తిగా సెబీ నియంత్రణల వెలుపల పనిచేస్తున్నాయి. 

అటువంటి డిజిటల్‌ బంగారం సాధనాలతో ఇన్వెస్టర్లు గణనీయమైన రిస్‌్కను ఎదుర్కోవాల్సి రావచ్చు’’అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయమంటూ కొన్ని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్‌ గోల్డ్‌పై ప్రచారం చేస్తున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక జారీ చేసింది. దీంతో డిజిటల్‌ గోల్డ్‌ను ఆఫర్‌ చేసే ప్లాట్‌ఫామ్‌లు తమను సైతం సెబీ నియంత్రణల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)