ఇకపై డిఫాల్ట్‌గా ‘డైరెక్ట్‌ మ్యూచువల్ ఫండ్స్‌’!

Published on Fri, 10/30/2026 - 08:29

మ్యూచువల్ ఫండ్ రంగంలో మదుపర్ల ప్రయోజనాలను మరింత పరిరక్షించే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చూపడుతోంది. నవంబర్ 1 నుంచి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల (ఏఎంసీ) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్స్ ఇకపై డిఫాల్ట్ ఆప్షన్‌గా మారనున్నాయి. సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత్ పాండే ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. ఈ నిబంధనల వెనుక ఉన్న అసలు లక్ష్యాలు, మదుపర్లపై దీని ప్రభావం ఎలా ఉండనుందనే అంశాలు కింద చూద్దాం.

అసలు మార్పు ఏమిటి?

సాధారణంగా మ్యూచువల్ ఫండ్లలో డైరెక్ట్, రెగ్యులర్ అని రెండు రకాల ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండూ ఒకే రకమైన అండర్ లైయింగ్ పోర్ట్‌ఫోలియోలో ఒకే పథకంలో పెట్టుబడి పెడతాయి. అయితే, రెగ్యులర్ ప్లాన్‌ల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు లేదా మధ్యవర్తులకు కమిషన్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల రెగ్యులర్ ప్లాన్‌ల ఎక్స్‌పెన్స్ రేషియో(నిర్వహణ ఖర్చు) డైరెక్ట్ ప్లాన్‌లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.

తాజా నిబంధనల ప్రకారం, నవంబర్ 1 నుంచి ఏఎంసీల డిజిటల్ మాధ్యమాల్లో మదుపర్లు లావాదేవీలు చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా డైరెక్ట్ ప్లాన్ ఎంపిక డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా మధ్యవర్తుల ద్వారా రెగ్యులర్ ప్లాన్‌ను ఎంచుకోవాలనుకుంటే ఆ ప్లాన్‌కు సంబంధించిన అధిక ఎక్స్‌పెన్స్ రేషియో, ఇతర ఖర్చుల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

దీర్ఘకాలిక లాభాలపై ప్రభావం

ఈ మార్పు వల్ల మదుపర్ల దీర్ఘకాలిక సంపద సృష్టిపై గణనీయమైన సానుకూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, తక్కువ ఖర్చులు ఉండే డైరెక్ట్ ప్లాన్లలో మదుపు చేయడం ద్వారా ఏజెంట్ల కమిషన్ భారం తప్పుతుంది. దీనివల్ల కాలక్రమేణా రిటర్న్స్ మెరుగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు రెండు దశాబ్దాల కాలంలో క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లో చిన్న వ్యత్యాసాలు సైతం కోట్లలో రాబడి తేడాను చూపుతాయి. అందువల్ల మదుపర్లు తాము ఎంచుకునే ప్లాన్ వెనుక ఉన్న వ్యయాలను ముందే అంచనా వేయడానికి ఈ విధానం పారదర్శకతను చేకూరుస్తుంది.

రెగ్యులర్ ప్లాన్‌లు రద్దు కావు

ఈ నిబంధన కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో డిఫాల్ట్ డిస్‌ప్లేను మాత్రమే మారుస్తుందని సెబీ స్పష్టం చేసింది. అంతేతప్ప రెగ్యులర్ ప్లాన్‌లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికే ఉన్న పెట్టుబడుల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. మదుపర్లకు ఇప్పటికీ రెగ్యులర్ ప్లాన్‌లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. అయితే, మధ్యవర్తుల ద్వారా సర్వీసులు కోరుకునేవారు ఆయా ప్లాన్‌ల అదనపు ఖర్చుల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: 40 వేలమంది భద్రతా సిబ్బంది డేటా లీక్‌

Videos

అడుగడుగునా భారీ రెస్పాన్స్.. విజయవాడ మేయర్ మాదే!

ఈసీకి YSRCP లేఖ.. పెన్షన్ల పేరుతో ఓటర్లకు టీడీపీ గాలం..

వరుదు కళ్యాణికి నా మద్దతు.. దయచేసి ఓటు వేసి గెలిపించండి

కూటమి నాయకులు ఓటు అడిగితే జనాలు చెప్పులు చూపిస్తున్నారు

అండమాన్ లో అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు...

ఒక మాఫియా ముఠా దిగుతోంది.. పోలింగ్ బూత్ వద్ద మీరు చేయాల్సింది ఒక్కటే

మమ్మల్ని కొడితే కొట్టారు.. నామినేషన్లు వేయకుండా జనసేన నేతలను కొట్టడం ఏంట్రా

వరుదు కళ్యాణి అనే నేను.. ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం

హృదయవిదారక ఘటన.. తండ్రి జైలులో.. నానమ్మతో కలిసి ప్రచారంలో పిల్లలు

నన్ను రౌడీ అంటావా? ABV గుట్టు రట్టు చేసిన గౌతంరెడ్డి!

Photos

+5

అనిల్ కపూర్ నివాసంలో ‘కర్వా చౌత్’ పండుగ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

వేడుకగా కర్వాచౌత్‌ ...సెలబ్రిటీల సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

సీతాకోకచిలుకలా సీతారామం బ్యూటీ మృణాల్.. (ఫోటోలు)

+5

గ్రీన్ డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

ఆదర్శ కుటుంబం హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్యూటీఫుల్ లుక్స్.. (ఫోటోలు)

+5

రెడ్ రోజ్‌లా మెరిసిపోతున్న నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

మన్మధుడు హీరోయిన్ అన్షు కార్వా చౌత్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)