Breaking News

లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్లకు సింగిల్‌ విండో

Published on Mon, 12/08/2025 - 06:32

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సింగిల్‌ విండోను ప్రవేశపెట్టింది. తద్వారా దేశీ స్టాక్‌ మార్కెట్లో లావాదేవీలు చేపట్టేందుకు నిబంధనలను సరళతరం చేసింది. ఇందుకు సింగిల్‌ విండో ఆటోమేటిక్‌ అండ్‌ జనరలైజ్‌డ్‌ యాక్సెస్‌ ఫర్‌ ట్రస్ట్‌డ్‌ ఫారిన్‌ ఇన్వెస్టర్స్‌(స్వాగత్‌–ఎఫ్‌ఐ)పేరుతో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. తద్వారా విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకునేందుకు వీలు చిక్కనుంది. దీంతో వివిధ పెట్టుబడి మార్గాలను ఏకీకృతం చేయడంతోపాటు.. ఆయా సంస్థలు నిబంధనలు పాటించడంలో మరింత సరళతర విధానాలకు తెరతీసింది.

 లోరిస్క్‌ విదేశీ ఇన్వెస్టర్ల జాబితాలో ప్రభుత్వ ఫండ్స్, కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్, మలీ్టలేటరల్‌ సంస్థలు, అత్యధిక నియంత్రణలు కలిగిన పబ్లిక్‌ రిటైల్‌ ఫండ్స్, తగిన నియంత్రణలున్న బీమా కంపెనీలు, పెన్షన్‌ ఫండ్స్‌ను సెబీ చేర్చింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), విదేశీ వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్టర్ల(ఎఫ్‌వీసీఐలు)కు విడిగా రెండు నోటిఫికేషన్లను స్వాగత్‌–ఎఫ్‌ఐ మార్గదర్శకాలకు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా సెబీ నిబంధనలను సవరించింది. వెరసి 2026 జూన్‌1 నుంచి ఇవి అమలుకానున్నాయి. ఈ ప్రతిపాదనలకు సెబీ బోర్డు సెపె్టంబర్‌లో ఆమోదముద్ర వేసింది.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు