Breaking News

‘ఈ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడింగ్‌ వద్దు’.. సెబీ హెచ్చరిక!

Published on Tue, 12/10/2024 - 09:57

అనధికారిక ప్లాట్‌ఫామ్‌లపై అన్‌లిస్టెడ్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల సెక్యూరిటీలలో ట్రేడింగ్‌ నిర్వహించే విషయమై సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ తరహా లావాదేవీలు సెక్యూరిటీస్‌ కాంట్రాక్టుల చట్టం 1956, సెబీ యాక్ట్‌ 1992కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.

అన్‌లిస్టెడ్‌ సెక్యూరిటీల్లో ట్రేడింగ్‌ చేసేందుకు వీలుగా కొన్ని గుర్తింపు లేని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లు అవకాశం కల్పిస్తున్నట్లు సెబీ తెలిపింది. అటువంటి ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని హెచ్చరించింది. ఆయా ప్లాట్‌ఫామ్‌ల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లకు సెబీ గుర్తింపు లేదని స్పష్టం చేసింది. అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెక్యూరిటీలను ట్రేడింగ్ చేయడం వల్ల పారదర్శకత లేకపోవడం, పరిమిత లిక్విడిటీ, చట్టపరమైన సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపింది.

ఇప్పటికే హెచ్చరికలు

అనధికారిక వర్చువల్‌ ట్రేడింగ్, పేపర్‌ ట్రేడింగ్, ఫ్యాంటసీ గేమ్స్‌ తదతర వాటిపై లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. లిస్టెడ్‌ సెక్యూరిటీలలో గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సెబీ సూచించింది. అధీకృత ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ విధానాలు అనధికార ప్లాట్‌ఫామ్‌ల్లో ఉండవని వివరించింది. గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల సమాచారాన్ని సెబీ పోర్టల్‌ నుంచి తెలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐ

కొన్ని లిస్టెడ్‌ ఆన్‌లైన్‌ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్‌లు

  • గ్రో

  • జెరోధా

  • ఏంజిల్‌ వన్‌

  • అప్‌స్టాక్స్‌

  • ఐసీఐసీఐ డైరెక్ట్‌

  • కోటక్‌ సెక్యూరిటీస్‌

  • హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

  • ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌

  • మోతిలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)