Breaking News

‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్‌ నోటీసులు

Published on Fri, 01/03/2025 - 08:55

న్యూఢిల్లీ: లిస్టింగ్‌ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్‌ చంద్ర, ఆయన కుమారుడు పునీత్‌ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్‌ నోటీసు (ఎస్‌సీఎన్‌) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస​్‌సీఎన్‌లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్‌తో పాటు సంస్థ టాప్‌ మేనేజ్‌మెంట్‌పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్‌ గోయెంకా వివాద సెటిల్మెంట్‌ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్‌–టైమ్‌ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు.  

ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్‌

రిలయన్స్‌ నేవల్‌ పేరు మార్పు

న్యూఢిల్లీ: రిలయన్స్‌(Reliance) నేవల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సంస్థ పేరు స్వాన్‌ డిఫెన్స్‌ అండ్‌ హెవీ ఇండస్ట్రీస్‌గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్‌ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ను స్వాన్‌ ఎనర్జీ దక్కించుకుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)